Telugu Global
Cinema & Entertainment

Unstoppable | బాలయ్యతో లిమిటెడ్ ఎడిషన్

Unstoppable - బాలయ్యతో ఉన్నఫలంగా అన్-స్టాపబుల్ మొదలుపెట్టారు. అయితే ఇది కొత్త సీజన్ కాదు, లిమిటెడ్ ఎడిషన్.

Unstoppable | బాలయ్యతో లిమిటెడ్ ఎడిషన్
X

ఉన్నఫలంగా తెరపైకొచ్చింది అన్-స్టాపబుల్ షో. ఆహా యాప్ లో సూపర్ హిట్టయిన ఈ షోను సడెన్ గా తెరపైకి తీసుకొచ్చారు. దీనికి కొన్ని రాజకీయ కారణాలున్నాయని చాలామంది అనుకున్నారు. కానీ కేవలం తన సినిమా ప్రచారం కోసమే అన్నది తాజా మేటర్.

అన్-స్టాపబుల్ కార్యక్రమంలో చాలా సినిమాలకు ప్రమోషన్స్ నడిచాయి. మరి బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా ప్రచారం చేయకపోతే ఎలా? అందుకే ఉన్నఫలంగా ఈ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారు. గెస్టులు అందుబాటులో లేకపోయినా కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి ఇదే కారణం.

పొలిటికల్ కారణాలతో ఈ షో స్టార్ట్ చేశారని, కేటీఆర్ తో ఇంటర్వ్యూ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే అన్-స్టాపబుల్ లో పాల్గొనడానికి కేటీఆర్ అంగీకరించలేదు. అటు భగవంత్ కేసరి యూనిట్ తో చిట్ చాట్ మాత్రం పూర్తి చేశారు. ఇక చిరంజీవి ఇంటర్వ్యూతో అన్-స్టాపబుల్ ను క్లోజ్ చేయాలనుకుంటున్నారు.

ఓ 3-4 ఇంటర్వ్యూలతోనే ఈసారి అన్-స్టాపబుల్ ముగిసేలా కనిపిస్తోంది. అందుకే దీన్ని సీజన్-3 అనట్లేదు. లిమిటెడ్ ఎడిషన్ అని పేరు పెట్టారు. భగవంత్ కేసరి ప్రచారం కోసం ఇలా మరోసారి తెరపైకొచ్చింది అన్-స్టాపబుల్.

First Published:  13 Oct 2023 2:03 AM GMT
Next Story