Telugu Global
Cinema & Entertainment

Unstoppable - బ్రహ్మానందం చేతుల మీదుగా అన్ స్టాపబుల్ ట్రయిలర్ లాంచ్

Unstoppable Movie Trailer Review - పూర్తి స్థాయిలో కామెడీ ఎలిమెంట్స్ తో వస్తోంది అన్ స్టాపబుల్ మూవీ. బ్రహ్మానందం ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ చేశారు.

Unstoppable - బ్రహ్మానందం చేతుల మీదుగా అన్ స్టాపబుల్ ట్రయిలర్ లాంచ్
X

బిగ్ బాస్ ఫేమ్ వీజే సన్నీ, సప్తగిరి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం అన్ స్టాపబుల్. ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రజిత్ రావు నిర్మించిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు. ఈ ట్రయిలర్ రిలీజ్ వేడుకకు హాస్యనటులు బ్రహ్మానందం ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా ట్రయిలర్ లాంచ్ అయింది.

విజె సన్నీ, సప్తగిరి మంచి స్నేహితులు, వారికి డబ్బు అవసరం. మరోవైపు మిస్సయిన డ్రగ్స్ ప్యాకెట్స్ కోసం విలన్ అన్వేషణలో ఉంటాడు. సన్నీ, సప్తగిరి 100 కోట్ల విలువైన డ్రగ్స్ ని కనుగొంటారు. ఆ తర్వాత ఈ ఇద్దరు హీరోలు, ఆ సింగిల్ విలన్ మధ్య ఏం నడిచింది, ఎంత కామెడీ పుట్టిందనే కోణంలో ట్రయిలర్ ను కట్ చేశారు.

ట్రయిలర్ లో లీడ్ ఆర్టిస్టులిద్దరూ బాగానే ఆకట్టుకున్నారు. వీళ్లతో పాటు బిత్తిరి సత్తి, షకలక శంకర్, పృథ్వీ, పోసాని తదితరుల ఈ ట్రయిలర్ లో కనిపించి మెప్పించారు. నక్షత్ర, అక్సా ఖాన్‌ తమ గ్లామర్ చూపించారు. డైమండ్ రత్నబాబు మంచి యాక్షన్‌ కు, కామెడీ మిక్స్ చేసి కథ రాసుకున్నట్టు ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

అన్ స్టాపబుల్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు ఈ దర్శకుడు. ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేకపోయిన ఈ దర్శకుడు.. తాజా చిత్రంతో హిట్ కొట్టాలనుకుంటున్నాడు. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నవ్వులు పంచుతుందని చెబుతున్నాడు రత్నబాబు.



First Published:  3 Jun 2023 2:06 PM GMT
Next Story