Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu: మహేష్ బాబుతో సినిమా కోసం కొత్త స్ట్రాటజీ వాడనున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

Mahesh Babu-Trivikram Srinivas Movie: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబుతో సినిమా కోసం కొత్త స్ట్రాటజీ వాడనున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
X

మహేష్ బాబుతో సినిమా కోసం కొత్త స్ట్రాటజీ వాడనున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. #ఎస్ఎస్ఎంబీ28 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.

అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూడవ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాని ప్రకటించి చాలా కాలం అయింది కానీ సినిమా షూటింగ్ మాత్రం పట్టాలెక్కలేదు. గత కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు సినిమా కోసం కొత్త స్ట్రాటజీని ఉపయోగించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా షూటింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ త్వరగా పూర్తి చేయాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నారట. ఇప్పటిదాకా ఏ సినిమా కోసమైనా త్రివిక్రమ్ ప్రముఖ నటీనటులను ఎంపిక చేసుకునేవారు. వారితో సినిమా అంటే వారి డేట్ లు చూసుకొని అందరి డేట్లు కుదిరినప్పుడు సినిమా షూటింగ్ ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది. దీంతో షూటింగ్ కూడా ఆలస్యమయ్యేది. అయితే మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం త్రివిక్రమ్ ఇలా చేయాలి అనుకోవటం లేదట.

ముందుగానే సినిమా కోసం కొన్ని డేట్లు అనుకొని ఆ డేట్ లలో ఎవరైతే నటీనటులు అవైలబుల్ గా ఉంటారో వారిని మాత్రమే సినిమాలో తీసుకోవాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. ఇలా చేస్తే షూటింగ్ కూడా తొందరగా పూర్తవుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫారిన్ లొకేషన్లో షూటింగులు కాకుండా ఈసారి మహేష్ బాబు తో సినిమా చాలావరకు లోకల్ లొకేషన్స్ లోనే తీయాలని త్రివిక్రమ్ అనుకుంటున్నారట. ఏదేమైనా సినిమాపై అంచనాలు మాత్రం రోజురోజుకీ పెరుగుతూనే వస్తున్నాయి.

First Published:  23 Dec 2022 9:35 AM GMT
Next Story