Telugu Global
Cinema & Entertainment

లొకేషన్ మార్చిన త్రివిక్రమ్

త్రివిక్రమ్ రెగ్యులర్ గా కనిపించే హోటల్ పార్క్ హయత్. కానీ ఇప్పుడు ఆయన ఆ హోటల్ లో ఉండడం లేదు. మరో స్టార్ హోటల్ కు మకాం మార్చారు. మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించి అన్ని వ్యవహారాలు అక్కడ్నుంచే...

trivikram-went-to-germany
X

త్రివిక్రమ్ అంటే పార్క్ హయత్... పార్క్ హయత్ అంటే త్రివిక్రమ్. ఈ స్టార్ హోటల్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఉన్న అనుబంధం గురించి ఇండస్ట్రీలో ఎవర్ని అడిగినా చెబుతారు. ఈ హోటల్ తో త్రివిక్రమ్ కు చాలా మెమొరీస్ ఉన్నాయి. ఈ సెవెన్ స్టార్ హోటల్ లో త్రివిక్రమ్ కు పర్మినెంట్ రూమ్ ఉంది. అలాంటి సెంటిమెంట్ హోటల్ ను ఇప్పుడు త్రివిక్రమ్ పక్కనపెట్టారు.

ప్రస్తుతం మహేష్ తో మూవీ కోసం రెడీ అవుతున్నాడు త్రివిక్రమ్. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమా స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నారు దర్శకుడు త్రివిక్రమ్, హీరో మహేష్ బాబు.

దీని కోసం పార్క్ హయత్ ను కాకుండా.. ఈసారి ఐటీసీ కోహినూర్ హోటల్ ను ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం ఈ హోటల్ లోనే ఓ లగ్జరీ రూమ్ లో ప్రాజెక్టుకు తుదిమెరుగులు దిద్దుతున్నాడు త్రివిక్రమ్. హీరో మహేష్ కూడా ఇక్కడికే వచ్చి కథాచర్చల్లో పాల్గొంటున్నాడు.

సెట్స్ పైకి వెళ్లేలోపు ఈ సినిమాను బౌండెడ్ స్క్రిప్ట్ గా మార్చాలనేది మహేష్ ఆలోచన. ఆ పట్టుదలతోనే ఇన్నాళ్లూ సినిమాను స్టార్ట్ చేయలేదు. ఎట్టకేలకు ఈ మూవీ స్క్రీన్ ప్లే కొలిక్కి వచ్చినట్టు కనిపిస్తోంది. గడిచిన 3 రోజులుగా హీరో-దర్శకుడు సుదీర్ఘంగా చర్చల్లో మునిగిపోయారు. ఈరోజు లేదా రేపటికి ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తవుతాయి.

First Published:  6 Sep 2022 11:22 AM GMT
Next Story