Telugu Global
Cinema & Entertainment

Trisha | ఓటీటీలోకి త్రిష సినిమా

Trisha - త్రిష కొత్త సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు.

Trisha | ఓటీటీలోకి త్రిష సినిమా
X

త్రిష ది రోడ్ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హీరోయిన్ ప్రస్తుతం, లియో విజయాన్ని ఆస్వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె గతంలో అరుణ్ వసీగరన్ దర్శకత్వం వహించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ ది రోడ్‌లో కనిపించింది. ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో త్రిష ఆనందం రెట్టింపు అయింది.

తాజాగా ఓటీటీలోకి వచ్చింది “ది రోడ్”. ఆహా యాప్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది. త్రిషకు తెలుగులో ఉన్న ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకొని, తమిళ్ తో పాటు, తెలుగులో ఈ సినిమాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆహాలో ట్రెండ్ అవుతున్న మూవీ ఇదే.

ఈ సినిమాతో పాటు త్వరలోనే లియో కూడా స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఆ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ తో పాటు, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే, అది కేవలం థియేట్రికల్ వెర్షన్ మాత్రమే కాదు, ఓటీటీ కోసం అదనంగా మరో 18 నిమిషాల సన్నివేశాల్ని జత చేశారు.

లియో కూడా ఓటీటీలోకి వస్తే, త్రిషకు మరింత క్రేజ్ పెరుగుతుంది. దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ, ఇప్పటికీ అదే క్రేజ్ ను కొనసాగిస్తూ కెరీర్ ను కొనసాగించడం విశేషం. ఓవైపు సక్సెస్ ఫుల్ సినిమాలతో పాటు, మరోవైపు పెళ్లి పుకార్లతో ఈ బ్యూటీ.. నిత్యం వార్తల్లో వ్యక్తిగా మారింది.



First Published:  10 Nov 2023 4:53 PM GMT
Next Story