Telugu Global
Cinema & Entertainment

Tripti Dimri | ఎన్టీఆర్ అంటే ఇష్టం అంటున్న యామిమల్ బ్యూటీ

Tripti Dimri - యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది త్రిప్తి దిమ్రి. ఈ బ్యూటీ ఎన్టీఆర్ పై మనసు పారేసుకుంది.

Tripti Dimri | ఎన్టీఆర్ అంటే ఇష్టం అంటున్న యామిమల్ బ్యూటీ
X

యంగ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ, యానిమల్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సినిమాలోని ఆమె మెయిన్ లీడ్ కానప్పటికీ.. హీరోయిన్ రష్మిక కంటే ఆమెకు ఎక్కువ క్రేజ్ వచ్చింది. యానిమల్‌లో రణబీర్ కపూర్‌తో త్రిప్తి డిమ్రీ చేసిన నగ్న దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. త్వరలో ఆమె పలు ఆఫర్లను చేజిక్కించుకోవడంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో.. ఎన్టీఆర్‌తో నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టింది త్రిప్తి దిమ్రీ. ఈ స్టేట్ మెంట్ తో తారక్ ఫ్యాన్స్ థ్రిల్ ఫీలవుతున్నారు.

పైన చెప్పినట్లుగా, త్రిప్తి దిమ్రీ యానిమల్ విడుదల తర్వాత నేషనల్ క్రష్‌గా మారింది. సినిమా విడుదలైన తర్వాత ఆమె సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండింగ్‌లో ఉంది. మీడియాతో ఇటీవల జరిగిన ఇంటరాక్షన్‌లో, త్రిప్తిని ఏ దక్షిణ భారత నటుడితో కలిసి పని చేయాలని కోరుకున్నారు అని అడిగారు. ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలనుకుంటున్నానని త్రిప్తి తెలిపింది.

త్వరలోనే వార్-2 సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. అందులో త్రిప్తిని తీసుకోవాలంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ చేయబోయే సినిమాలో కూడా త్రిప్తిని తీసుకోవాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు.

First Published:  14 Dec 2023 1:03 AM GMT
Next Story