Telugu Global
Cinema & Entertainment

సమంత కోసం రంగంలోకి స్టార్ హీరోలు

రేపు యశోద ట్రయిలర్ గ్రాండ్ గా లాంఛ్ కాబోతోంది. దీని కోసం ఒక్కో భాష నుంచి ఒక్కో స్టార్ ను రంగంలోకి దించింది సమంత.

సమంత కోసం రంగంలోకి స్టార్ హీరోలు
X

సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'యశోద'. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి స్పందన వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ట్రైలర్ కోసం అంతా వెయిటింగ్. ఇప్పుడా అప్ డేట్ వచ్చేసింది. రేపు ఈ సినిమా ట్రయిలర్ వస్తోంది. ఈ లాంఛింగ్ కోసం హీరోల్ని రంగంలోకి దించింది సమంత.

తెలుగులో హీరో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, హిందీలో వరుణ్ ధావన్ 'యశోద' ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఇలా స్టార్ హీరోలంతా ఒకేసారి యశోద ట్రయిలర్ ను లాంఛ్ చేస్తున్నారు

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబర్ 11న ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్ లాంటి క్రేజీ నటీనటులు ఇందులో నటిస్తున్నారు మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  26 Oct 2022 2:55 PM GMT
Next Story