Telugu Global
Cinema & Entertainment

Top Hit Telugu Songs 2022: ఈ ఏడాది దుమ్ము లేపిన సాంగ్స్ ఇవే..

Top Hit Telugu Songs 2022: ఈ ఏడాది సినిమా లవర్స్‌కు పండుగగా చెప్పుకోవచ్చు. భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు ఈ ఏడాది ఆడియెన్స్‌ను అలరించాయి. అలాగే నెలకో ఆల్బమ్ చొప్పున బోలెడు పాటలు జనాన్ని ఉర్రూతలూగించాయి.

Top Hit Telugu Songs 2022: ఈ ఏడాది దుమ్ము లేపిన సాంగ్స్ ఇవే..
X

Top Hit Telugu Songs 2022: ఈ ఏడాది దుమ్ము లేపిన సాంగ్స్ ఇవే..

ఈ ఏడాది సినిమా లవర్స్‌కు పండుగగా చెప్పుకోవచ్చు. భాషతో సంబంధం లేకుండా ఎన్నో సినిమాలు ఈ ఏడాది ఆడియెన్స్‌ను అలరించాయి. అలాగే నెలకో ఆల్బమ్ చొప్పున బోలెడు పాటలు జనాన్ని ఉర్రూతలూగించాయి. ఏడాది ముగింపు సందర్భంగా ఈ ఏడాది దుమ్ము లేపిన పాటలను ఓసారి గుర్తు చేసుకుందాం.

ఈ ఏడాది అలరించిన పాటల గురించి చెప్పుకోవాలంటే అన్నింటికంటేముందుగా 'నాటు నాటు' సాంగ్ గురించి చెప్పుకోవాలి. ఒక్క తెలుగు ఆడియెన్స్‌నే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ ఆడియెన్స్‌ను కూడా మెప్పించి ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచిన ఈ సాంగ్.. 2022లోనే బెస్ట్ సాంగ్ అనడంలో సందేహం లేదు. అలాగే ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌లోని 'దోస్తీ', 'కొమురం భీముడో పాటలు కూడా ఈ ఏడాది సూపర్‌‌ హిట్‌గా నిలిచాయి.

ఈ ఏడాది బెస్ట్ ఆల్బమ్‌గా చెప్పుకోవాల్సిన మరో సినిమా 'సీతారామం'. ఇందులోని కూల్ మెలోడీ సాంగ్స్ అన్నిరకాల ఆడియెన్స్‌కు తెగ నచ్చేసాయి. యూత్, ఫ్యామిలీ అని లేకుండా ప్రతీ ఒక్కరూ ఈ పాటలను ఎంజాయ్ చేశారు. మ్యూజిక్‌తో పాటు లిరిక్స్‌ను కూడా ఎంతగానో లైక్ చేశారు. ఇందులో' ఓ సీ'తా పాటను బెస్ట్‌గా చెప్పుకోవచ్చు. మొత్తంగా 2022 క్లాసిక్ హిట్స్‌గా సీతారామం పాటలు మిగిలిపోతాయి.

ఇక ఈ ఏడాది మొదట్లో రిలీజైన 'డీజే టీల్లు' సాంగ్ ఏ రేంజ్‌లో హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పార్టీల నుంచి పబ్‌ల వరకూ, పెళ్లిళ్ల నుంచి ఊరేగింపుల వరకూ ఈ సాంగ్ మారుమోగిపోయింది. దీంతో పాటు ఈ ఏడాది వచ్చిన 'బుల్లెట్టు బండి', 'పల్సర్ బైక్' పాటలు కూడా మాస్ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాయి. ఇవన్నీ ఈ ఏడాది వచ్చిన బెస్ట్ మాస్ సాంగ్స్‌గా చెప్పుకోవచ్చు.

ఇకపోతే బ్రహ్మాస్త్ర లోని 'కేసరియా' పాట ఈ ఏడాది సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. అలాగే ధనుష్ 'తిరు' సనిమాలోని 'నా మది..' అనే సాంగ్, 'విక్రాంత్‌ రోణ'లోని 'రా రా రక్కమ్మ' పాటలు కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో తెగ వినిపించాయి. వీటిని ఈ ఏడాది బెస్ట్ సోషల్ మీడియా ట్రెండీ సాంగ్స్‌గా చెప్పుకోవచ్చు.

ఇక చివరగా రీసెంట్‌గా వచ్చిన 'వాల్తేరు వీరయ్య' లోని 'బాస్‌ పార్టీ' సాంగ్ ప్రస్తుతం ఊపు ఊపేస్తుంది. దాంతో పాటు రవితేజ ధమకా లోని 'జింతాక్.. జింతాక్'.. సాంగ్ కూడా మోత మోగిస్తోంది. అలాగే 'కాంతార'లోని 'వరాహ రూపం' పాట ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిపోయింది. ఏదేమైనా పాట నచ్చితే చాలు, అది మన సినిమా అయినా, డబ్బింగ్ సినిమా అయినా, ప్రైవేట్ సాంగ్ అయినా ప్రేక్షకులు గుండెల్లో నిలిచిపోతుంది. అలాంటి పాటలే ఇవన్నీ. ఇవి ఈ ఏడాదే కాదు ఇకపై కూడా వినిపిస్తూనే ఉంటాయి. మ్యూజిక్ చేసే మ్యాజిక్ అలాంటిది మరి.

First Published:  27 Dec 2022 1:43 AM GMT
Next Story