Telugu Global
Cinema & Entertainment

Sudheer Varma Suicide: టాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య

Sudheer Varma suicide: టాలీవుడ్ యువనటుడు సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నాడు.

Sudheer Varma Suicide: టాలీవుడ్ యువ నటుడు ఆత్మహత్య
X

మరో యువనటుడు ప్రాణాలు తీసుకున్నాడు. అతడే సుధీర్ వర్మ. ఆమధ్య వచ్చిన కుందనపు బొమ్మ సినిమాలో సెకెండ్ హీరోగా నటించాడు సుధీర్ వర్మ. ఆ సినిమాలో సుధాకర్ కోమాకుల హీరోగా నటించగా, సెకెండ్ లీడ్ లో సుధీర్ కనిపించాడు. ఈ సినిమాతో పాటు సూపర్ హిట్టయిన షూటవుట్ ఎట్ ఆలేరు వెబ్ సిరీస్ లో కూడా ఇతడు నటించాడు.

కిషోర్ తిరుమల డైరక్ట్ చేసిన సెకెండ్ హ్యాండ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు సుధీర్. ఆ సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కుందనపు బొమ్మ సినిమాలో నటించాడు. ఈ రెండు ప్రాజెక్టులతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, అతడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

Advertisement

ఈరోజు విశాఖపట్నంలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు సుధీర్. అవకాశాల్లేక డిప్రెషన్ కు గురై అతడు సూసైడ్ చేస్తున్నాడనే ప్రచారం నడుస్తోంది. మరోవైపు వ్యక్తిగత సమస్యలతో అతడు ప్రాణాలు తీసుకున్నాడనే వదంతులు కూడా వ్యాపిస్తున్నాయి.

అతడి ఆత్మహత్యకు అసలు కారణం ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి తేలలేదు. సుధీర్ మరణంతో సుధాకర్ కోమాకుల చలించిపోయాడు. ఓ మంచి స్నేహితుడ్ని, సోదరుడ్ని కోల్పోయానంటూ తన బాధను వ్యక్తం చేశాడు.

Next Story