Telugu Global
Cinema & Entertainment

Shooting Updates | ఏ సినిమా ఎక్కడ?

Shooting Updates - బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాల షూటింగ్స్ శరవేగంగా సాగుతున్నాయి. షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం..

Shooting Updates | ఏ సినిమా ఎక్కడ?
X

ఎన్టీఆర్ గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్ పూర్తయింది. నైట్ ఎఫెక్ట్ లో ఆ షెడ్యూల్ జరిగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ లోనే మరో సెట్ లో షూట్ మొదలైంది.

ఖుషి సినిమా యూనిట్ రాజమండ్రి వెళ్లింది. సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో విజయ్ దేవరకొండ, సమంతపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. సినిమా క్లయిమాక్స్ కు సంబంధించిన సన్నివేశాలివి. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ చేయబోతున్నారు.

భగవంత్ కేసరి కోసం హైదరాబాద్ లోని కొండపూర్ లో ఓ సెట్ వేశారు. ఆ సెట్ లోనే తాజాగా కొత్త షెడ్యూల్ మొదలైంది. బాలకృష్ణ, రఘుబాబు, ఇతర నటీనటులపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. తానా సభల కోసం అమెరికా వెళ్లింది శ్రీలీల. ఆమె తిరిగొచ్చిన తర్వాత భగవంత్ కేసరి షెడ్యూల్ లో జాయిన్ అవుతుంది.

ఇదే ఏరియాలో రవితేజ కొత్త సినిమా ఈగల్ కు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలైంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం రవితేజ బల్క్ కాల్షీట్లు ఇచ్చాడు. ఈ సినిమా షూట్ కంప్లీట్ అయిన తర్వాత కొత్త సినిమాలు ప్రకటించబోతున్నాడు.

First Published:  5 July 2023 4:34 AM GMT
Next Story