Telugu Global
Cinema & Entertainment

Shooting Updates | ఏ సినిమా ఎక్కడ?

Shooting Updates - దేవర, గేమ్ ఛేంజర్, పుష్ప-2, గుంటూరుకారం.. ఈ సినిమాల షూటింగ్ అప్ డేట్స్ చెక్ చేద్దాం.

Shooting Updates | ఏ సినిమా ఎక్కడ?
X

మహేష్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతోంది గుంటూరుకారం సినిమా. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి అన్నపూర్ణ స్టుడియోలో షూటింగ్ జరుగుతోంది. స్టుడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో మహేష్, మీనాక్షి చౌదరితో పాటు మరికొందరిపై సాంగ్ షూట్ చేస్తున్నారు.

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో పుష్ప-2 షూటింగ్ జరుగుతోంది. రద్దీ ప్రాంతం కావడంతో, లొకేషన్ ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ షెడ్యూల్ లో అల్లు అర్జున్ పాల్గొంటున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.

దేవర కోసం శంషాబాద్ సమీపంలో భారీ సెట్ వేశారు. ఈ సెట్ లోనే ఎన్టీఆర్ పై ప్రస్తుతం కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. కొరటాల శివ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాతో జాన్వి కపూర్, టాలీవుడ్ కు పరిచయమౌతోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

గేమ్ ఛేంజర్ షూటింగ్ కొన్ని రోజులుగా మైసూర్ తదితర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ కోసం 4 రోజుల కిందటే మైసూర్ వెళ్లాడు రామ్ చరణ్. ప్రస్తుతం చరణ్ తో పాటు సునీల్, కియరా అద్వానీ, జయరాం లాంటి నటీనటుల మధ్య కీలక సన్నివేశాలు తీస్తున్నారు. శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. నిర్మాతగా దిల్ రాజుకు ఇది 50వ చిత్రం.

First Published:  2 Dec 2023 2:49 PM GMT
Next Story