Telugu Global
Cinema & Entertainment

రికార్డు స్థాయిలో సెప్టెంబర్ సినిమాల సందడి!

క్యాలెండర్ పేజీ తిరగేద్దాం. సెప్టెంబర్ మాసం. సెప్టెంబర్ లో ఎన్ని సినిమాలు రిలీజవుతున్నాయో తెలుసుకుంటే కళ్ళు తిరుగుతాయి. సెప్టెంబర్‌లో 27 సినిమాలు విడుదలకి లిస్ట్ అయ్యాయి. ఈ 27 లో ఎన్ని విడుదలవుతాయన్నది చెప్పలేం. ఇంత సంఖ్యలో విడుదలకి సిద్ధమై తీరా థియేటర్లు దొరక్క వెనక్కెళ్ళిన సందర్భాలున్నాయి.

రికార్డు స్థాయిలో సెప్టెంబర్ సినిమాల సందడి!
X

లాక్ డౌన్ తర్వాత ఎన్నడూ లేని విధంగా ఆగస్టు '22 ఒకే నెలలో మూడు సినిమాలు హిట్టయ్యాయి. ఇంకోటి 'లైగర్' కూడా హిట్టవ్వాల్సింది. అది నత్తి వల్ల అనర్హతా వేటు వేసుకుంది. 'బింబిసార', 'సీతా రామం', 'కార్తికేయ 2' ఈ మూడూ మంచి విజయాలు సాధించాయి. 'లైగర్' తో బాటు 'పక్కా కమర్షియల్', 'ది వారియర్', 'థాంక్యూ', 'రామారావు ఆన్ డ్యూటీ', 'మాచర్ల నియోజకవర్గం', 'తీస్ మార్ ఖాన్' మొదలైన విజయ్ దేవరకొండ, గోపీచంద్, రామ్ పోతినేని, నాగచైతన్య, రవితేజ, నితిన్, ఆది సాయికుమార్ లు నటించిన స్టార్ సినిమాలు ఏడూ అట్టర్ ఫ్లాపయ్యాయి. ఆగస్టు 31 న విక్రమ్ నటించిన 'కోబ్రా' విడుదలవుతోంది. దీని జాతకం ఆ రోజు తెలుస్తుంది.

క్యాలెండర్ పేజీ తిరగేద్దాం. సెప్టెంబర్ మాసం. సెప్టెంబర్ లో ఎన్ని సినిమాలు రిలీజవుతున్నాయో తెలుసుకుంటే కళ్ళు తిరుగుతాయి. సెప్టెంబర్‌లో 27 సినిమాలు విడుదలకి లిస్ట్ అయ్యాయి. ఈ 27 లో ఎన్ని విడుదలవుతాయన్నది చెప్పలేం. ఇంత సంఖ్యలో విడుదలకి సిద్ధమై తీరా థియేటర్లు దొరక్క వెనక్కెళ్ళిన సందర్భాలున్నాయి.

పక్కాగా విడుదలవుతాయని చెప్పగల సినిమాలు 'రంగ రంగ వైభవంగా', 'ఫస్ట్ డే ఫస్ట్ షో', 'బ్రహ్మాస్త్రం', 'శాకినీ ఢాకినీ', 'రావణాసురుడు' వంటి కొన్ని వున్నాయి. పూర్తి లిస్టు ఈ కింద చూద్దాం.

సెప్టెంబర్ 2 విడుదలలు: 'రంగ రంగ వైభవంగా' : వైష్ణవ తేజ్, కేతికా శర్మ, నరేష్, ప్రభు, నవీన్ చంద్ర, తులసి, శ్రీలక్ష్మి, ప్రగతి, సుబ్బరాజు, సత్య అక్కెల, రాజ్‌కుమార్, రఘుబాబు, ఝాన్సీ మొదలైన నటీనటులు క్రిక్కిరిసి వున్నారు. ఇది యూత్ రోమాన్స్ అంటున్నారు. దర్శకుడు గిరీశాయ కొత్తవాడు. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు.


'ఫస్ట్ డే ఫస్ట్ షో': శ్రీకాంత్ రెడ్డి, సంచితా బాషు, తనికెళ్ల భరణి, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ ఆచంట, ప్రభాస్ శ్రీను, గంగవ్వ, సీవీఎల్ నరసింహారావు, వంశీధర్ గౌడ్, సాయి చరణ్... ఇలా ఇందులో కూడా నటీనటులు క్రిక్కిరిసి వున్నారు. జంట దర్శకులు వంశీధర్‌ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి ఇద్దరూ కొత్తవాళ్ళు. ఇది కామెడీ. ఏడిద శ్రీ రామ్ నిర్మాత.

సెప్టెంబర్ 9 విడుదలలు: 'బ్రహ్మాస్త్రా' (తెలుగు): రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, నాగార్జున అక్కినేని, ఆలియా భట్, మౌనీ రాయ్, డింపుల్ కపాడియా, విక్రమ్ గోఖలే, దివ్యేందూ శర్మ, సౌరవ్ గుర్జార్, విశాల్, కర్వాల్, ప్రతీక్ బబ్బర్, ప్రియల్ గోర్, విశాల్ సింగ్, అమృతా పూరి, చెత్నా పాండే, దీపక్ టిజో పాండే... భారీ తారాగణం. దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాత కరణ్ జోహార్. ఇది స్పిరిచ్యువల్ ఫాంటసీ.

'ఒకే ఒక జీవితం': శర్వానంద్, రీతూ వర్మ, అమలా అక్కినేని, నాజర్, రవి రాఘవేంద్ర, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, జై ఆదిత్య, మధునందన్, అలీ, హితేష్, నిత్యరాజ్ తారాగణం. దర్శకుడు శ్రీ కార్తీక్ తమిళుడు. నిర్మాత ఎస్ ఆర్ ప్రభు. ఇది సైన్స్ ఫిక్షన్.

'నేను మీకు బాగా కావాల్సినవాడిని': కిరణ్ అబ్బవరం, సంజనా ఆనంద్ హీరోహీరోయిన్లు. దర్శకుడు : శ్రీధర్ గాదె. కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య నిర్మాత. ఇది ఫ్యామిలీ ఎంటర్టయినర్.

సెప్టెంబర్ 9 విడుదలలు: 'గుర్తుందా శీతాకాలం' : సత్య దేవ్, తమన్నా భాటియా నటించారు. దర్శకుడు నాగశేఖర్ కొత్తవాడు. ఇది రోమాంటిక్ డ్రామా.


'18 పేజీలు': నిఖిల్ సిద్ధార్థ, అనుపమా పరమేశ్వరన్ నటీనటులు. 'కుమారి 21 ఎఫ్' తీసిన పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. దీనికి రచన సుకుమార్. ఇది శృంగార భరిత ప్రేమ కథ.

సెప్టెంబర్ 10 విడుదల: 'ధమాకా'. తారాగణం రవితేజ, శ్రీ లీల. దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఇది యాక్షన్ రోమాన్స్.

సెప్టెంబర్ 11 విడుదల: 'సర్దార్' (తమిళ డబ్బింగ్). కార్తీ, రాశీ ఖన్నా, చంకీ పాండే, మురళీ శర్మా నటించారు. దర్శకుడు మిత్రన్ పి.ఎస్. ఇది స్పై యాక్షన్.

సెప్టెంబర్ 16 విడుదలలు: 'శాకినీ ఢాకినీ'. నివేదా థామస్, రెజీనా కసాండ్రా జాన్సన్, రవికుమార్ తారాగణం. దర్శకుడు సుధీర్ వర్మ. నిర్మాత డి. సురేష్ బాబు. ఇది కామెడీ థ్రిల్లర్

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి': సుధీర్ బాబు, కృతీ శెట్టి హీరోహీరోయిన్లు. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి. నిర్మాత మహేంద్ర బాబు. ఇది రోమాంటిక్ డ్రామా.

సెప్టెంబర్ 19 విడుదల: 'వినరో భాగ్యము విష్ణు కథ' : కిరణ్ అబ్బవరం, కాశ్మీరా పరదేశీ నటించారు. దర్శకత్వం మురళీ కిషోర్ అబ్బూరు. నిర్మాత బన్నీ వాసు. ఇది యాక్షన్ రోమాన్స్.

సెప్టెంబర్ 23 విడుదలలు: 'అల్లూరి' : తారాగణం : శ్రీవిష్ణు, కయదు లోహర్, తనికెళ్ళ భరణి, సుమన్ తారాగణం. దర్శకుడు ప్రదీప్ వర్మ. బెక్కెమ్ వేణుగోపాల్ నిర్మాత. ఇది కాల్పనిక బయోపిక్.

'దొంగలున్నారు జాగ్రత్త' : శ్రీ సింహా, ప్రీతీ అస్రానీ, సముద్ర కానీ తారాగణం. సతీష్ త్రిపుర దర్శకత్వం. డి. సురేష్ బాబు నిర్మాత. ఇది యాక్షన్ థ్రిల్లర్

సెప్టెంబర్ 23 విడుదలలు: కృష్ణా బృందా విహారీ : నాగచైతన్య, షెర్లీ, రాహుల్ రామకృష్ణ, సత్యా, రాధికా శరత్ కుమార్ తారాగణం. దర్శకుడు అనీష్ కృష్ణ. నిర్మాత ఉషా మల్పూరి. ఇది రోమాంటిక్ కామెడీ.

'ఇట్స్ టైమ్ టు పార్టీ' : శ్రీముఖి నటించింది. దర్శకుడు గౌతమ్ ఈవీఎస్. నిర్మాత అల్లం సుభాష్. ఇది రోమాంటిక్ థ్రిల్లర్.

సెప్టెంబర్ 26 విడుదలలు: 'నాకిదే ఫస్ట్ టైమ్' : ధనుష్ బాబు, సింధూరా రౌత్, కావ్యా కీర్తీ నటీనటులు. దర్శకుడు రాంరెడ్డి మస్కీ. ఇది అడల్ట్ రోమాన్స్.

'సర్వం సిద్ధం' : తారాగణం : గోవింద్ రాజ్, కిరణ్ మేడసాని నటించారు. దర్శకుడు అతిమళ్ళ రాబిన్ నాయుడు. ఇది కామెడీ రోమాన్స్

'అడవి' : తారాగణం : ఆది సాయికుమార్, వేదిక. దర్శకుడు విఘ్నేష్ కార్తీక్. ఇది హారర్ థ్రిల్లర్

27 సెప్టెంబర్ విడుదలలు: 'నటనా సూత్రధారి : తారాగణం : అమిత్ రంగనాథ్, సుశీల్ మాధవపెద్ది దర్శకుడు: సురేందర్ కొంటాడ్డి. ఇది థ్రిల్లర్.

'ది లస్ట్ - ఎ మర్డర్ మిస్టరీ' : తారాగణం: శ్రీ రాపాక, అమిత్ తివారీ. దర్శకుడు ఎస్కే ఎన్. ఇది అడల్ట్ రోమాన్స్ థ్రిల్లర్

'గుండె కథ వింటారా' : తారాగణం: మధు నందన్, స్వాతిష్ఠా కృష్ణన్. వంశీధర్ భోగరాజు దర్శకత్వం. ఇది రోమాంటిక్ థ్రిల్లర్.

'పోలీస్ వారి హెచరిక' : నాగశౌర్య నటించాడు. దర్శకుడు: కేపీ రాజేంద్ర. మహేష్ కోనేరు నిర్మాత. ఇది. యాక్షన్ రోమాన్స్.

సెప్టెంబర్ 30 విడుదలలు: 'రావణాసురుడు' : తారాగణం: రవితేజ, అనూ ఇమ్మాన్యూయేల్ల్, మేఘా ఆకాష్, ఫారియా అబ్దుల్లా, పూజితా పొన్నాడ తారాగణం. దర్శకుడు సుధీర్ వర్మ. నిర్మాత అభిషేక్ నామా. ఇది మాస్ యాక్షన్.

'బిచ్చగాడు 2' (తమిళ డబ్బింగ్) : విజయ్ ఆంటోని మూవీ. దర్శకుడు ప్రియా కృష్ణస్వామి. ఇది ఫ్యామిలీ డ్రామా.

'హనుమాన్' : తారాగణం: తేజా సజ్జ, అమృతా అయ్యర్ నటించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం. ఇది ఫాంటసీ.

'అన్నీ మంచి శకునములే' : తారాగణం : సంతోష్ శోభన్, మాళవికా నాయర్, రావు రమేశ్, వెన్నెల కిషోర్. దర్శకురాలు నందిని రెడ్డి. నిర్మాతలు ప్రియాంకా దత్, స్వప్నా దత్. ఇది ప్రేమ కథ.

తేదీలు ప్రకటించిన ఈ మొత్తం 27 సినిమాల్లో సెప్టెంబర్లో చిన్న బడ్జెట్ సినిమాలు ఎన్ని విడుదలవుతాయో, ఎన్ని ఆగిపోతాయో, ఎన్ని ఓటీటీల్లో దర్శనమిస్తాయో వేచి చూడాల్సిందే!

First Published:  29 Aug 2022 7:36 AM GMT
Next Story