Telugu Global
Cinema & Entertainment

Tollywood | ఘనంగా టాలీవుడ్ నవతిహి ఉత్సవం

Tollywood - 90 ఏళ్ల ఘన చరిత్రను సెలబ్రేట్ చేసేందుకు టాలీవుడ్ సిద్ధమైంది. దీనికి నవతహి అనే పేరు పెట్టారు.

Tollywood | ఘనంగా టాలీవుడ్ నవతిహి ఉత్సవం
X

తెలుగు చిత్ర సీమ 90 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు మలేషియాన వేదికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇది 90 ఏళ్ల తెలుగు సినిమా వారసత్వానికి సంబంధించిన గొప్ప వేడుక కానుంది. మన తెలుగు సినిమా ప్రయాణం 1932లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విష్ణు మంచు ఆధ్వర్యంలో ఘనంగా జరగనుంది.

కౌలాలంపూర్‌లోని బుకిట్ జలీల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ స్టేడియంలో జూలై 20న ఈ వేడుకని ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలో సినిమా రంగానికి చెందిన అతిరథలు ఎందరో హాజరు కానున్నారు. ఈ వేడుక ప్రాముఖ్యతను వివరిస్తూ, ఈ కార్యక్రమానికి ప్రోత్సాహకరంగా నిలుస్తున్న భాగస్వామ్యులను అందరినీ పరిచయం చేస్తూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు.

మూడు దేశాల నుండి వచ్చిన ప్రతిపాదనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఈ ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌ను మలేషియాలో నిర్వహించడం ఉత్తమమని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం అంతర్జాతీయ సాంస్కృతిక సమావేశాలకు అగ్రశ్రేణి వేదికగా తన సామర్థ్యాలను ప్రదర్శించడానికి మలేషియా నిబద్ధతను నొక్కి చెబుతుంది. మలేషియా టూరిజం , మా అసోసియేషన్, ఎంసీ ఎంటర్‌టైన్‌మెంట్‌ భాగస్వామ్యంతో, ఈ గ్లోబల్ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారు.

నవతిహి ఉత్సవం 2024 కేవలం సినిమా విజయాల వేడుక మాత్రమే కాదు. మలేషియా ప్రజలు, తెలుగు మాట్లాడే వర్గాల మధ్య పరస్పర అవగాహన, గౌరవాన్ని పెంపొందించే సాంస్కృతిక మార్పిడికి చిహ్నంగా ఈ ఈవెంట్ జరగనుంది.

First Published:  8 May 2024 1:20 AM GMT
Next Story