Telugu Global
Cinema & Entertainment

రామ్‌చ‌ర‌ణ్ మూవీ టైటిల్ వ‌చ్చేసింది

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో శ్రీ‌కాంత్‌, అంజ‌లి, ఎస్‌జే సూర్య‌, జ‌య‌రామ్‌, సునీల్, స‌ముద్ర‌ఖ‌ని, నాజ‌ర్‌ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

రామ్‌చ‌ర‌ణ్ మూవీ టైటిల్ వ‌చ్చేసింది
X

హీరో రామ్‌చ‌ర‌ణ్‌, దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న మూవీ టైటిల్‌ని ఆ చిత్ర బృందం సోమ‌వారం విడుద‌ల చేసింది. ఈ చిత్రానికి `గేమ్ ఛేంజ‌ర్` అని టైటిల్ ఫిక్స్ చేశారు. రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఈ టైటిల్ మెగా అభిమానుల్లో గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

`ఆర్ఆర్ఆర్‌`తో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్న రామ్‌చ‌ర‌ణ్.. త‌ర్వాతి చిత్రం ద‌ర్శ‌కుడు శంక‌ర్‌తో క‌లిసి చేస్తున్న విష‌యం తెలిసిందే. కియారా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో శ్రీ‌కాంత్‌, అంజ‌లి, ఎస్‌జే సూర్య‌, జ‌య‌రామ్‌, సునీల్, స‌ముద్ర‌ఖ‌ని, నాజ‌ర్‌ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందిస్తున్నారు.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని ఇప్ప‌టివ‌ర‌కు ఆర్‌సీ-15 వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపొందిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ హైద‌రాబాద్‌, న్యూజిలాండ్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర, విశాఖ‌ప‌ట్నం, పంజాబ్‌ల‌లో నిర్వ‌హించారు.

First Published:  27 March 2023 7:16 AM GMT
Next Story