Telugu Global
Cinema & Entertainment

Hidimba | ఈ సినిమా టైటిల్ వెనక సీక్రెట్ ఇదే

Title secret behind Hidimba | హిడింబ సినిమాకు ఆ టైటిల్ ఎలా వచ్చింది? దాని వెనక సీక్రెట్ ఏంటి?

Hidimba | ఈ సినిమా టైటిల్ వెనక సీక్రెట్ ఇదే
X

అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో ఎస్వీకే సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. నందితా శ్వేత హీరోయిన్ గా నటిస్తోంది. ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలాగే ప్రీమియర్స్ కి కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు థియేటర్లలోకి వచ్చింది ఈ సినిమా. ఇంతకీ హిడింబ అంటే ఏంటి? ఈ టైటిల్ వెనక సీక్రెట్ ఏంటి? స్వయంగా హీరో అశ్విన్ ఈ విశేషాల్ని వెల్లడించాడు.

"వాస్తవానికైతే ఈ కథకు ‘రాక్షసుడు’ అనే టైటిల్ కావాలి. కానీ అప్పటికే ఈ పేరుతో సినిమాలు వచ్చాయి. ఆ స్థానంలో మరో పేరు కోసం అన్వేషించినపుడు ‘హిడింబ’ అనే పేరు అయితే బావుంటుదని భావించాం. దీని అర్ధం కూడా రాక్షసుడు అనే అర్ధానికి దగ్గరగా ఉంటుంది. దీనికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. అందుకే ఈ టైటిల్ ఫిక్స్ చేశాం."

సీట్ ఎడ్జ్ థ్రిల్ ఇద్దామనే దృష్టితోనే ఈ సినిమా చేశాడట అశఅవిన్. ప్రిమియర్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో, తన నమ్మకం పెరిగిందంటున్నాడు. తన కెరీర్ లో విలక్షణ పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చానని, హిడింబలో కూడా తనది అలాంటి పాత్రే అంటున్నాడు.

First Published:  20 July 2023 8:44 AM GMT
Next Story