Telugu Global
Cinema & Entertainment

SSMB28 - మరికొన్ని రోజుల్లో పూర్తి క్లారిటీ

Mahesh Trivikram Movie - మహేష్-త్రివిక్రమ్ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. మరో వారం రోజుల్లో ప్రకటన రానుంది.

SSMB28 - మరికొన్ని రోజుల్లో పూర్తి క్లారిటీ
X

మహేష్, త్రివిక్రమ్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. టైటిల్ ఫిక్స్ చేయకుండానే దాదాపు ఏడాదిగా ఈ ప్రాజెక్టు నలుగుతోంది. ఇన్నాళ్లూ ఈ ప్రాజెక్టును SSMB28 గానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇకపై అలా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ ఉగాదికి మహేష్-త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయబోతున్నారు.

మహేష్-త్రివిక్రమ్ గతంలో అతడు, ఖలేజా సినిమాలు చేశారు. ఆ సెంటిమెంట్ కలిసొచ్చేలా మూడక్షరాల పదాన్ని టైటిల్ గా పెట్టాలనుకున్నారు. కానీ ఖలేజా ఫ్లాప్ అవ్వడంతో ఆ ఆలోచన నుంచి తప్పుకున్నారు. కథకు తగ్గట్టు టైటిల్ ఫిక్స్ చేయాలని డిసైడ్ అయ్యారు.

ఇందులో భాగంగా పార్థు అనే టైటిల్ బాగా ప్రచారంలోకి వచ్చింది. అతడు సినిమాలో మహేష్ పోషించిన పాత్ర పేరు ఇదే. ఆ తర్వాత అర్జునుడు అనే టైటిల్ కూడా బాగా నలిగింది. అయితే ఈ మధ్య కాలంలో అమ్మ కథ అనే సాఫ్ట్ టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది.

ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టబోతున్నారనే విషయం ఈ ఉగాదితో తేలిపోతుంది. అంటే, సరిగ్గా మరో వారం రోజుల్లో మహేష్ మూవీ టైటిల్ ఏంటనేది క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. పూజాహెగ్డే, శ్రీలల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  15 March 2023 2:42 AM GMT
Next Story