Telugu Global
Cinema & Entertainment

Tillu Square release date: 'టిల్లు స్క్వేర్' విడుదల తేదీ ఫిక్స్

Tillu Square release date: డీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది టిల్లూ స్క్వేర్. తాజాగా ఈ సినిమాకు రిలీజ్ డేట్ లాక్ చేశారు.

Tillu Square release date: టిల్లు స్క్వేర్ విడుదల తేదీ ఫిక్స్
X

Tillu Square release date: 'టిల్లు స్క్వేర్' విడుదల తేదీ ఫిక్స్

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్న సినిమా టిల్లూ స్క్వేర్. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరో. సూపర్ హిట్టయిన డీజే టిల్లూ సినిమాకు సీక్వెల్ ఇది.

శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 'డీజే టిల్లు' చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న సిద్ధు, అదే పేరుతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు ఈ యువనటుడు 'డీజే టిల్లు' సీక్వెల్‌ 'టిల్లు స్క్వేర్'తో వస్తున్నాడు. ఈసారి రెట్టింపు వినోదాన్ని పంచడానికి, సిద్ధూతో పాటు అనుపమ పరమేశ్వరన్ తోడైంది.

ఈ సినిమాని సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నట్లు ఈరోజు ప్రకటించిన చిత్ర బృందం, సిద్ధు-అనుపమ పరమేశ్వరన్‌ ల రొమాంటిక్ పోస్టర్‌ ను విడుదల చేసింది. ఈ చిత్రం మొదటి భాగాన్ని మించి రెట్టింపు వినోదాన్ని, థ్రిల్ ని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతోంది. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

డీజే టిల్లూ సినిమాకు కొనసాగింపుగా, టిల్లూ స్క్వేర్ వస్తోందా లేదా అనే అంశంపై మేకర్స్ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. డీజే టిల్లూ క్లయిమాక్స్ లో హీరోయిన్ జైలుకు వెళ్తుంది. ఆమెకు హీరో బెయిల్ వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత తన దందాను ఇంటర్నేషనల్ లెవెల్ కు తీసుకెళ్తాడు. అక్కడ్నుంచి సినిమా కొనసాగుతుందా లేక కేవలం టైటిల్ నే తీసుకున్నారా అనేది తేలాల్సి ఉంది.

ఈ చిత్రానికి రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల కలిసి సంగీతం అందిస్తుండగా, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నాడు.



First Published:  5 Jun 2023 11:50 AM GMT
Next Story