Telugu Global
Cinema & Entertainment

Tillu Square | టిల్లూ స్క్వేర్ ట్రయిలర్ వచ్చేసింది

Tillu Square - సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న సినిమా టిల్లూ స్క్వేర్. ఈ సినిమా నుంచి ట్రయిలర్ రిలీజ్ చేశారు.

Tillu Square | టిల్లూ స్క్వేర్ ట్రయిలర్ వచ్చేసింది
X

సిద్ధు జొన్నలగడ్డ 'డీజే టిల్లు' చిత్రంతో సంచలన బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది 'టిల్లు స్క్వేర్'.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌లో 'టిల్లు స్క్వేర్' ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. "టిల్లు" ఫిల్మ్ ఫ్రాంచైజీ నుండి ఈ చిత్రం మరో భారీ బ్లాక్ బస్టర్ ఎంటర్టైనర్ ను అందించడానికి సిద్ధంగా ఉందని ట్రైలర్ తో స్పష్టమైంది.

ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో ఆమె, పక్కింటి అమ్మాయిలా కాకుండా, అర్బన్ లుక్స్ తో కాస్త బోల్డ్ గా కనిపిస్తోంది. ఆమె బాడీ లాంగ్వేజ్, సిద్ధూతో ఆమె కెమిస్ట్రీ ఈ ట్రైలర్‌లో హైలైట్‌గా నిలిచాయి.

మొదటి భాగంలో రాధిక ప్రేమ కారణంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్న టిల్లు.. ఇప్పుడు మరోసారి అదే తరహాలో సమస్యల సమూహంలో చిక్కుకున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. రామ్ మిరియాల స్వరపరిచిన పాటలు ఇప్పటికే విడుదలై వైరల్ అవుతున్నాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందిస్తున్నారు. మల్లిక్ రామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'టిల్లు స్క్వేర్' చిత్రం మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.

First Published:  14 Feb 2024 5:11 PM GMT
Next Story