Telugu Global
Cinema & Entertainment

Tiger Nageswararao | రవితేజ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్

Tiger Nageswararao - రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి మూడో సాంగ్ రిలీజైంది. ఈసారి మెలొడీ సాంగ్ విడుదల చేశారు.

Tiger Nageswararao | రవితేజ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్
X

మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావుతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ప్రొడ్యూస్ చేశాడు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని 2 పాటలు ఇప్పటికే రిలీజయ్యాయి. తాజాగా ‘ఇచ్చేసుకుంటాలే’ అనే లిరిక్స్ తో సాగే మూడో పాటను విడుదల చేశారు.

బ్యూటీఫుల్ రొమాంటిక్ మెలోడీగా ఈ పాటని కంపోజ్ చేశాడు జీవి ప్రకాష్. భాస్కరభట్ల రవికుమార్ అందించిన సాహిత్యం.. హీరోయిన్ మనసులోని ప్రేమని చాలా అందంగా ఆవిష్కరించింది. సింధూరి మెస్మరైజ్ వాయిస్ తో ఆకట్టుకున్నారు. ఈ పాటలో రవితేజ, గాయత్రి భరద్వాజ్ ల కెమిస్ట్రీ వండర్ ఫుల్ గా ఉంది. విజువల్స్ బాగున్నాయి.

నూపుర్ సనన్ మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్‌ మదీ సినిమాటోగ్రాఫర్. టైగర్ నాగేశ్వరరావు దసరా సందర్భంగా అక్టోబర్ 20న అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలో విడుదల కానుంది.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే జోరగా ప్రచారం చేస్తున్నాడు రవితేజ. నార్త్ లో ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ పెట్టాడు. ఆ తర్వాత ఉత్తరాది మీడియాకు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. మధ్యలో క్రికెట్ కామెంటరీ బాక్స్ లో కూడా కనిపించాడు. మరో 2 రోజుల్లో తెలుగు మీడియా ముందుకు రాబోతున్నాడు. టైగర్ నాగేశ్వరరావు కోసం ఆంధ్రప్రదేశ్ లో ఓ భారీ ప్రచార కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారు.

First Published:  13 Oct 2023 1:58 AM GMT
Next Story