Telugu Global
Cinema & Entertainment

Tiger Nageswara Rao Teaser Review | టైగర్ నాగేశ్వరరావు టీజర్ అదిరింది

Tiger Nageswara Rao Teaser Review | రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమా టీజర్ రిలీజైంది.

Tiger Nageswara Rao Teaser Review | టైగర్ నాగేశ్వరరావు టీజర్ అదిరింది
X

Tiger Nageswara Rao Teaser Review | టైగర్ నాగేశ్వరరావు టీజర్ అదిరింది

Tiger Nageswara Rao Teaser Review | ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ గ్లింప్స్ యావత్ దేశాన్ని షేక్ చేశాయి. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు నుంచి మరో సర్ ప్రైజ్ వచ్చింది. మాస్ మహారాజా రవితేజ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైగర్ దండయాత్ర టీజర్ విడుదలైంది.

హైదరాబాదు, ముంబై, ఢిల్లీ, దేశంలోని అనేక ప్రాంతాలలో దొంగతనాలు చేసిన స్టూవర్ట్‌పురం దొంగ, టైగర్ నాగేశ్వరరావు మద్రాస్ సెంట్రల్ జైలు నుండి పరారీలో ఉన్నారనే వార్తా కథనంతో టీజర్ ప్రారంభమవుతుంది. మునుపెన్నడూ ఇలాంటి ఘటన జరగకపోవడంతో పోలీసులు షాక్‌ అవుతారు. టైగర్‌ జోన్‌లో పనిచేసిన మురళీ శర్మ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా టైగర్ నాగేశ్వరరావులోని అరుదైన నైపుణ్యాలను వివరిస్తారు.

‘’నాగేశ్వరరావు పాలిటిక్స్ లోకి వెళ్లుంటే వాడి తెలివితేటలతో ఎలక్షన్ గెలిచేవాడు. స్పోర్ట్స్ లోకి వెళ్లుంటే వాడి పరుగుతో ఇండియాకి మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్లుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే గెలిచేవాడు. దురదృష్టవశాత్తు, వాడొక క్రిమినల్ అయ్యాడు'' అని మురళీ శర్మ టైగర్ నాగేశ్వరరావు సామర్థ్యాలను వివరిస్తారు.

టీజర్ లో రవితేజ లుక్, ఎనర్జీ బాగున్నాయి. 1970ల వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేసిన సెట్స్, సినిమాటోగ్రఫీ, టీజర్ లో హైలెట్ గా నిలిచాయి. జీవీ ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది ఈ చిత్రం.



First Published:  17 Aug 2023 5:13 PM GMT
Next Story