Telugu Global
Cinema & Entertainment

Tiger 3 | మొదటి రోజు దుమ్ముదులిపిన సల్మాన్ సినిమా

Tiger 3 - సల్మాన్-కత్రినా జంటగా నటించిన సినిమా టైగర్-3. మొదటి రోజు ఈ సినిమా దుమ్ముదులిపింది. రికార్డ్ వసూళ్లు సాధించింది.

Tiger 3 box office collection | సల్మాన్ ఖాన్ సినిమాకు రూ. 300 కోట్లు
X

Tiger 3 box office collection | సల్మాన్ ఖాన్ సినిమాకు రూ. 300 కోట్లు

దీపావళి కానుకగా రిలీజైంది టైగర్-3 సినిమా. పండగను దృష్టిలో పెట్టుకొని, ఈ సినిమాను ఏకంగా ఆదివారం విడుదల చేశారు. సల్మాన్ కెరీర్ లోనే ఓ సినిమా ఇలా ఆదివారం రిలీజవ్వడం ఇదే తొలిసారి.

అలా ప్రపంచవ్యాప్తంగా ఆదివారం రిలీజైన టైగర్-3 సినిమా... రికార్డ్ ఓపెనింగ్స్ సాధించింది. కత్రినాకైఫ్ హీరోయిన్ గా మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

ఈ సినిమా హిందీ వెర్షన్ కు తొలి రోజు రూ. 43 కోట్ల రూపాయల నెట్ వచ్చింది. ఇక డబ్బింగ్ వెర్షన్ కు కోటి 50 లక్షల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఇండియాలో ఈ సినిమాకు మొదటి రోజు 44 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ వచ్చింది. హిందీ సినీ చరిత్రలోనే దీపావళి రోజున అత్యథిక గ్రాస్ రాబట్టిన సినిమాగా టైగర్-3 నిలిచింది.

సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన టైగర్-3 సినిమా మరో రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. ఈ ఫ్రాంచైజీలో భారీ ఓపెనింగ్స్ సాధించిన చిత్రం ఇదే. ఇంతకుముందు దీపావళికి విడుదలైన సినిమాల కంటే 3 రెట్లు అధికంగా వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచింది ఈ మూవీ.

First Published:  13 Nov 2023 5:05 PM GMT
Next Story