Telugu Global
Cinema & Entertainment

Ugram Movie - ఉగ్రం కోసం భారీగా టికెట్ రేట్లు తగ్గింపు

Ugram Movie - ఉగ్రం సినిమాకు ఇప్పటికే భారీగా ప్రచారం కల్పించారు. ఇప్పుడు ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు ఏకంగా టికెట్ రేట్లు తగ్గించారు.

Ugram Movie - ఉగ్రం కోసం భారీగా టికెట్ రేట్లు తగ్గింపు
X

అల్లరి నరేష్ నటించిన ఉగ్రం సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది. ఈ చిత్రానికి విభిన్నంగా ప్రచారం కల్పించారు. యాక్షన్ థ్రిల్లర్ లో తొలిసారి అల్లరి నరేష్ నటించిన ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. దీనికితోడు, నిఖిల్, అడివి శేష్, విశ్వక్ సేన్ వంటి పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలు ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం కలిసొచ్చింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని మల్టీప్లెక్స్‌లు. సింగిల్ స్క్రీన్‌లలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా టికెట్ రేట్లు తగ్గించారు. టికెట్ రేట్లు తగ్గించడం వల్ల ఉగ్రం సినిమాకు ఆక్యుపెన్సీ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నారు. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, తక్కువ టికెట్ రేట్ల కారణంగా, ఊపందుకుంటుందని భావిస్తున్నారు.

కొద్ది రోజుల కిందట సుహాస్ నింటిన రైటర్ పద్మభూషణ్ కోసం కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యారు. ఆ నిర్ణయం సత్ఫలితాలనిచ్చింది. సినిమా హిట్టయింది. ఇప్పుడు ఉగ్రం కోసం కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు.

పెద్ద సినిమాలు టిక్కెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వ అనుమతుల కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో చిన్న సినిమాలు అందుకు విరుద్ధంగా, తక్కువ టికెట్ రేట్లతో ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఇక్కడ కూడా అదే రిజల్ట్ రిపీట్ అవుతుందని ఉగ్రం నిర్మాతలు భావిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన మిర్నా మీనన్ హీరోయిన్ గా నటించింది.

First Published:  4 May 2023 12:26 PM GMT
Next Story