Telugu Global
Cinema & Entertainment

Hanuman | భారీగా టికెట్ రేట్లు తగ్గింపు

Hanu-Man Movie - హనుమాన్ మూవీ విజయవంతంగా 6వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా భారీగా టికెట్ రేట్లు తగ్గించారు.

Hanu-Man Box Office Collection | రూ.100 కోట్ల షేర్ దిశగా హనుమాన్
X

సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ హిట్టయింది హనుమాన్ సినిమా. 92 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో సంక్రాంతి సీజన్ లో రిలీజైన సినిమాల్లో హనుమాన్ దే అతి పెద్ద విజయం. ఈ సినిమాను ఇప్పటివరకు చూడని వాళ్లకు మరో అవకాశం కల్పిస్తోంది యూనిట్.

ప్రస్తుతం థియేటర్లలో 6వ వారంలోకి అడుగుపెట్టింది హనుమాన్. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా టికెట్ రేట్లు తగ్గించారు. ఈ సినిమాను మల్టీప్లెక్సుల్లో కేవలం 150 రూపాయలకు, సింగిల్ స్క్రీన్స్ లో కేవలం వంద రూపాయలకే చూడొచ్చు.

థియేటర్లలో హనుమాన్ సినిమాను చూడాలనుకుంటే ఇదే చివరి అవకాశం. ఎందుకంటే, వచ్చే వారం నుంచి ఇది థియేటర్లలో ఉండకపోవచ్చు. ఈ సినిమా రన్ దాదాపు ముగిసింది. సంక్రాంతికి రిలీజైన ఓ సినిమా 6 వారాల పాటు ఆడడమే గొప్ప విషయం. గుంటూరుకారం, సైంధవ్, నా సామిరంగ లాంటి సినిమాలు ఆల్రెడీ థియేట్రికల్ రన్ ముగించుకొని ఓటీటీలోకి కూడా వచ్చేశాయి. హనుమాన్ మాత్రం ఇంకా థియేటర్లలో కొనసాగుతుండడం చాలా పెద్ద విషయం.

జీ5 గ్రూప్ ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ కొనుగోలు చేసింది. మార్చి మొదటి వారంలో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది.

First Published:  18 Feb 2024 2:07 PM GMT
Next Story