Telugu Global
Cinema & Entertainment

Weekend Release | ఈవారం అరడజను సినిమాలు

Weekend Release - ఈ వీకెండ్ ఏకంగా అరడజను సినిమాలున్నాయి. వీటిలో రూల్స్ రంజన్, మామా మశ్చీంద్ర లాంటి సినిమాలున్నాయి.

Weekend Release | ఈవారం అరడజను సినిమాలు
X

ఈ వీకెండ్ ఏకంగా అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పేరుకు ఇవి చిన్న సినిమాలే అయినప్పటికీ, బాక్సాఫీస్ బరిలో క్లిక్ అవ్వడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీటికి. దీనికి కారణం, లాస్ట్ వీక్ రిలీజైన సినిమాలేవీ క్లిక్ అవ్వకపోవడమే. మరి ఈ వీకెండ్ వస్తున్న సినిమాలేంటి.. హేవే లుక్..

ఈ వీకెండ్ ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమా రూల్స్ రంజన్. కిరణ్ అబ్బవరం, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు భారీగా ప్రచారం కల్పిస్తున్నారు. రీసెంట్ గా సరైన సక్సెస్ అందుకోలేకపోయిన కిరణ్, ఈ సినిమాపై భారీగా హోప్స్ పెట్టుకున్నాడు. ట్రయిలర్ హిట్టవ్వడం, సమ్మోహనుడా అనే సాంగ్ క్లిక్ అవ్వడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్,

రూల్స్ రంజన్ కు పోటీగా మామా మశ్చీంద్ర రెడీ అయింది. సుధీర్ బాబు తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన మూవీ ఇది. మిర్నాలిని రవి, ఇషా రెబ్బా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు హర్షవర్ధన్ దర్శకుడు. రూల్స్ రంజన్ రేంజ్ లో ఈ సినిమాకు ప్రచారం చేయలేకపోతున్నారు. అయినప్పటికీ, ఉన్నంతలో ఆకర్షిస్తోంది ఈ మూవీ.

ఇక మ్యాడ్ అనే మరో చిన్న సినిమా కూడా వస్తోంది. ఈ సినిమాకు 2 ప్రత్యేకతలున్నాయి. ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్ ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమౌతున్నాడు. ఇక మరో ప్రత్యేకత ఏంటంటే, సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. కంప్లీట్ యూత్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా, కేవలం ఆ సెక్షన్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ వస్తోంది.

ఈ సినిమాలతో పాటు.. 800, చిన్నా, ఏందిరా పంచాయితీ అనే మరో 3 సినిమాలు కూడా ఈ శుక్రవారమే థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో 800 అనే మూవీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్. ఇక చిన్నా అనేది సిద్దార్థ్ హీరోగా నటించిన సూపర్ హిట్ తమిళ మూవీ. వీటిలో ఈ వీకెండ్ ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.

First Published:  3 Oct 2023 5:35 PM GMT
Next Story