Telugu Global
Cinema & Entertainment

Weekend Release Movies: ఈ వారం 6 సినిమాలు

Weekend Release Movies: ఈవారం అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో స్పై, సామజవరగమన సినిమాలపై అంచనాలున్నాయి

Weekend Release Movies: ఈ వారం 6 సినిమాలు
X

ఈ వీకెండ్ అరడజను సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో ఆదిపురుష్ నడుస్తోంది. ఈ 6 సినిమాల రాకతో భారీగా థియేటర్లు కోల్పోనుంది ప్రభాస్ మూవీ. పైగా సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో పాటు, ఆక్యుపెన్సీ కూడా పడిపోవడంతో, ఆదిపురుష్ ను చాలా స్క్రీన్స్ నుంచి తీసేయబోతున్నారు. ఇక ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమాల సంగతి చూద్దాం.

ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమా స్పై. నిఖిల్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా ఇది. కెరీర్ లో తొలిసారి నిఖిల్ గూఢచారిగా నటించిన సినిమా ఇది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గ్యారీ దర్శకుడు. సుభాష్ చంద్రబోస్ జీవితంలోని రహస్యాలు, ఆయన మరణం వెనక మిస్టరీని టచ్ చేస్తూ, ఈ సినిమాను తెరకెక్కించారు.

ఇక స్పైకి పోటీగా వస్తోంది సామజవరగమన. స్పై యాక్షన్ సినిమా అయితే, శ్రీవిష్ణు నటించిన సామజవరగమన పూర్తిగా ఫ్యామిలీ మూవీ. కుటుంబ బంధాలు, కామెడీతో ఈ సినిమా తెరకెక్కింది. ఆల్రెడీ మూవీపై పాజిటివ్ బజ్ నడుస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన పాత సినిమా తొలిప్రేమ కూడా థియేటర్లలోకి వస్తోంది. టాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమాను మరోసారి పెద్ద హిట్ చేయాలని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

ఇక దర్శకుడు దశరధ్ నిర్మాతగా మారాడు. లవ్ యు రామ్ అనే సినిమా నిర్మించాడు. ఈ సినిమాకు కథ కూడా అందించాడు. ఈ వీకెండ్ ఈ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలతో పాటు మాయాపేటిక, గండ, ఇండియానా జోన్స్ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో సామజవరగమన, స్పై సినిమాలపై మాత్రమే అంచనాలున్నాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చూడాలి.

First Published:  28 Jun 2023 12:39 PM GMT
Next Story