Telugu Global
Cinema & Entertainment

ఈ వారం 2 సినిమాలు.. రెండూ రెండే

ఈవారం కేవలం 2 సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ రెండింటిలో దేన్నీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.

ఈ వారం 2 సినిమాలు.. రెండూ రెండే
X

ప్రతివారం కనీసం అరడజను సినిమాలు థియేటర్లకు వచ్చేవి. కానీ ఈ వారం మాత్రం కేవలం 2 సినిమాలు మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే, ఆ 2 సినిమాలపై ఉన్న అంచనాలు అలాంటివి. పైగా ఇప్పటికే విక్రాంత్ రోణ కు భారీగా థియేటర్లు కేటాయించారు. దీంతో ఈ 2 సినిమాలు కాకుండా, మరో సినిమా వచ్చే అవకాశం లేకుండా పోయింది.

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో ముందుగా చెప్పుకోదగ్గ మూవీ బింబిసార. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరుగా అంచనాలున్నాయి. టైమ్ ట్రావెల్ మూవీ కావడం, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో సినిమాపై అందరి దృష్టి పడింది. దీనికితోడు ట్రయిలర్ హిట్టవ్వడం ఈ మూవీకి మరో పెద్ద ప్లస్ పాయింట్.

స్వయంగా కల్యాణ్ రామ్ రంగంలోకి దిగి ఈ సినిమా ప్రచార బాధ్యతల్ని భుజానికెత్తుకున్నాడు. దాదాపు 10 రోజుల నుంచి వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలా సినిమాను ఓ స్థాయి వరకు తీసుకొచ్చాడు. రిజల్ట్ ఏంటనేది మరో 24 గంటల్లో తేలిపోతుంది. సంయుక్త మీనన్, క్యాథరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో వశిష్ఠ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

ఇక బింబిసారుడిగా పోటీగా వస్తోంది సీతారామం సినిమా. ఇప్పటివరకు ఇలాంటి కథ రాలేదనే ప్రచారంతోపాటు, ఆఖరి నిమిషంలో ప్రభాస్ ను రంగంలోకి దించి ప్రేక్షకుల్ని తనవైపు తిప్పుకుంది ఈ సినిమా యూనిట్. దుల్కర్ సల్మాన్, మృణాల్ లాంటి హీరోహీరోయిన్లు ఉన్నప్పటికీ వాళ్లకు తెలుగులో క్రేజ్ అంతంతమాత్రమే. అందుకే సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రష్మికను తీసుకున్నారు. కేవలం ఈ సినిమా కథే ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుందని చెబుతున్నారు.

ప్రస్తుతం థియేటర్లకు ప్రేక్షకులకు రావడం లేదు. ఈ రెండు సినిమాలు ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తాయో చూడాలి.




First Published:  4 Aug 2022 8:00 AM GMT
Next Story