Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu vs Chiranjeevi: మహేష్ వర్సెస్ చిరంజీవి.. భోళా.. ఆగస్టుకు వాయిదా

Mahesh Babu vs Chiranjeevi Movies: ప్రస్తుతం మహేష్- త్రివిక్రమ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అయితే ఈసారి మహేష్ వర్సెస్ చిరంజీవి పోటీపడేలా కనిపిస్తోంది.

Mahesh Babu vs Chiranjeevi: మహేష్ వర్సెస్ చిరంజీవి.. భోళా.. ఆగస్టుకు వాయిదా
X

అగ్ర హీరోలు నటించిన సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్ లో కొంత గందరగోళం నెలకొంది. ఈ సంక్రాంతికి విడుదల కావలసిన సినిమాలు వేసవికి, దసరాకు, వచ్చే సంక్రాంతికి పోస్ట్ పోన్ అయ్యాయి. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు కూడా మళ్లీ వాయిదా పడుతున్నాయి. ఈసారి సంక్రాంతిలో రేసులో ప్రభాస్ ఆదిపురుష్, అఖిల్ ఏజెంట్, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, రామ్ చరణ్ ఆర్సీ15 పోటీలో ఉంటాయని నిర్మాతలు ప్రకటించారు.

అయితే ఏజెంట్ సినిమా ఏప్రిల్ 14కు వాయిదా పడింది. ఆదిపురుష్ జూన్ 12కు, హరిహర వీరమల్లు దసరాకు, రామ్ చరణ్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడ్డాయి. సమ్మర్ నుంచి వాయిదా పడ్డ చిరంజీవి భోళా శంకర్ ఇప్పుడు మహేష్ బాబు సినిమాకు పోటీగా వస్తోంది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 11వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు.

అయితే ఇప్పుడు అదే డేట్ కి చిరంజీవి భోళాశంకర్ వస్తున్నట్లు తెలుస్తోంది. దసరాకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, బాలకృష్ణ - అనిల్ రావిపూడి మూవీ పోటీలో ఉండటం, ఆ తర్వాత సెప్టెంబర్ లో ప్రభాస్ సలార్ విడుదల ఉండటంతో భోళా శంకర్ సినిమాను దసరా కంటే ముందే విడుదల చేయాలని ఆ మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ఆగస్టు 11 అయితే వీకెండ్ తో పాటు ఇండిపెండెన్స్ డే కూడా కలసి వస్తుందని ఆ డేట్ నే లాక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మహేష్- త్రివిక్రమ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనుకున్న సమయానికి షూటింగ్ కంప్లీట్ అయితే ఈసారి మహేష్ వర్సెస్ చిరంజీవి పోటీపడేలా కనిపిస్తోంది.

First Published:  19 Feb 2023 2:53 PM GMT
Next Story