Telugu Global
Cinema & Entertainment

వారియర్ మొదటి రోజు వసూళ్లు

రామ్ హీరోగా నటించిన సినిమా ది వారియర్. మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు ఇవీ..!

వారియర్ మొదటి రోజు వసూళ్లు
X

రామ్ హీరోగా నటించిన వారియర్ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, మొదటి రోజు వసూళ్లలో ఈ సినిమా బెస్ట్ అనిపించుకుంది. మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల 73 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అయితే రామ్ కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ ఓపెనర్ మాత్రం కాదు.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల రూపాయలకు అమ్మారు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమాకు అటుఇటుగా మరో 27 కోట్ల రూపాయలు రావాలి. మిక్స్ డ్ టాక్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది అనుమానాస్పదంగా మారింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ ఈ సినిమాకు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం - 1.96కోట్లు

సీడెడ్ - 1.04 కోట్లు

ఈస్ట్ - 51 లక్షలు

కృష్ణా - 38 లక్షలు

నెల్లూరు - 29 లక్షలు

వైజాగ్ - 1.02 కోట్లు

గుంటూరు - 1.19 కోట్లు

వెస్ట్ - 67 లక్షలు

తమిళనాడు - 94 లక్షలు

కర్ణాటక - 32 లక్షలు

రెస్టాఫ్ ది వరల్డ్ - 41 లక్షలు

First Published:  15 July 2022 11:24 AM GMT
Next Story