Telugu Global
Cinema & Entertainment

స్వాతిముత్యం కథ ఇదే

గణేశ్ బెల్లంకొండ హీరోగా పరిచయమౌతున్న సినిమా స్వాతిముత్యం. ఎలాంటి అంచనాలు పెంచకుండా ఉండేందుకు, ఈ సినిమా స్టోరీలైన్ ను ముందుగానే చెప్పేశారు మేకర్స్

స్వాతిముత్యం కథ ఇదే
X

బెల్లంకొండ వారసుడు, బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేశ్ హీరోగా రాబోతున్నాడు. అతడు హీరోగా పరిచయమౌతున్న సినిమా స్వాతిముత్యం. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి అతడు హీరోగా పరిచయమౌతున్నాడు. మరి స్వాతిముత్యం కథ ఏంటి? సితార బ్యానర్ కు ఈ కథ నచ్చడానికి కారణం ఏంటి?

అబ్బాయి పేరు బాల మురళి కృష్ణ. ఇంజనీరింగ్ పూర్తి చేసి చిన్న టౌన్ లో అప్పుడే జూనియర్ ఇంజనీర్ గా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న ఒక యువకుడి కథ ఈ చిత్రం. జాబ్ రాగానే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేద్దామని సంబంధాలు చూడటం మొదలుపెడతారు. ఒక సాధారణ పెళ్లిలో కూడా ఎన్ని కష్టాలు ఉంటాయో ఆసక్తికరంగా, సరదాగా చూపించే ప్రయత్నమే ఈ స్వాతిముత్యం.

ఇది సింపుల్ గా స్వాతిముత్యం కథ. ఇందులో గణేశ్ సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన గా నటిస్తోంది. ఇంతకీ ఈ సినిమాకు క్లాసిక్ టైటిల్ అయిన స్వాతిముత్యం అనే పేరును ఎందుకు పెట్టారో తెలుసా?

సినిమాలో పాత్రలన్నీ మిడిల్ క్లాస్ గా, అమాయకంగా ఉంటాయి. వాళ్లలో ఎలాంటి కుతంత్రాలు, విలనిజాలు ఉండవు. ఇంకా చెప్పాలంటే అందరూ స్వాతిముత్యాలే. అందుకే ఈ టైటిల్ పెట్టారు. పైగా ఈ టైటిల్ పెట్టమని సూచించింది కూడా ఎవరో కాదు. స్వయంగా సితార నిర్మాత రాధాకృష్ణ ఈ టైటిల్ బాగుంటుందని చెప్పడంతో, దాన్నే ఫిక్స్ చేశారు.

క్లాసిక్ మూవీ స్వాతిముత్యానికి, తమ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

First Published:  25 Sep 2022 10:08 AM GMT
Next Story