Telugu Global
Cinema & Entertainment

Rangabali - నాగశౌర్య సినిమా నుంచి రెండో పాట రిలీజ్

Nagashaurya's Rangabali - నాగశౌర్య తాజా చిత్రం రంగబలి. ఈ మూవీ నుంచి సెకెండ్ సాంగ్ రిలీజైంది.

Rangabali - నాగశౌర్య సినిమా నుంచి రెండో పాట రిలీజ్
X

నాగశౌర్య అవుట్-అండ్-అవుట్ ఎంటర్‌టైనర్ ‘రంగబలి’. ఈ చిత్రం ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. యుక్తి తరేజా హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు భారీ స్పందన వచ్చింది.

మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజుమేకర్స్ 'లవ్ స్టోరీ' ఫేమ్ పవన్ సిహెచ్ స్కోర్ చేసిన సెకండ్ సింగిల్ 'కల కంటూ ఉంటే' పాటని విడుదల చేశారు. మొదటి పాట మాస్ నంబర్ అయితే, రెండోది మంచి మెలొడీ. శౌర్య, యుక్తి మధ్య ఉన్న అందమైన బంధాన్ని ఈ పాట చూపిస్తుంది.

సార్థక్ కళ్యాణి, వైష్ తమ గాత్రంతో ఈ పాటకు అందం తీసుకొచ్చారు. కృష్ణకాంత్ సాహిత్యం ఆకట్టుకుంటుంది. నాగశౌర్య, యుక్తి కెమిస్ట్రీ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

దివాకర్ మణి కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి ఎఎస్‌ ప్రకాష్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌. ఈ చిత్రాన్ని జూలై 7న విడుదల చేయబోతున్నారు. పెళ్లి తర్వాత నాగశౌర్య నుంచి వస్తున్న సినిమా ఇదే.



First Published:  19 Jun 2023 2:28 PM GMT
Next Story