Telugu Global
Cinema & Entertainment

Rashmika | గర్ల్ ఫ్రెండ్ గా మారిన నేషనల్ క్రష్

Rashmika - కొత్త సినిమా ప్రకటించింది రష్మిక. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ది గర్ల్ ఫ్రెండ్ అనే టైటిల్ పెట్టారు.

Rashmika | గర్ల్ ఫ్రెండ్ గా మారిన నేషనల్ క్రష్
X

నేషనల్ క్రష్ రశ్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న "ది గర్ల్ ఫ్రెండ్" మూవీ అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

చి.ల.సౌ, మన్మథుడు 2 చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుతున్న రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈసారి తన సినిమా కోసం డిఫరెంట్ స్టోరీలైన్ రాసుకున్నాడు. కథతో పాటు స్క్రీన్ ప్లే, మాటలు కూడా అతడే రాసుకున్నాడు.

"ది గర్ల్ ఫ్రెండ్" సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉన్నాయి. 'నాదీ అని చెప్పుకోవడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ కిక్కే వేరురా...' అంటూ మోషన్ పోస్టర్ వాయిస్ ఓవర్ లో వచ్చిన డైలాగ్స్, రశ్మిక శ్వాసను ఆపి నీటిలో కూర్చుని ఉండటం...మూవీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను లాంచ్ చేసి వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారు.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది రష్మిక. ఆమె చేతిలో పుష్ప-2, యానిమల్, రెయిన్ బో సినిమాలున్నాయి. వీటితో పాటు ధనుష్-శేఖర్ కమ్ముల, గోపీచంద్ మలినేని-రవితేజ సినిమాల్లో కూడా ఆమె హీరోయిన్ గా లాక్ అయింది. సో.. గర్ల్ ఫ్రెండ్ సినిమాకు ఆమె కాల్షీట్లతోనే సమస్య. ఒక్కసారి అవి సెట్ అయితే సినిమా షూటింగ్ పరుగులు పెడుతుంది.

First Published:  23 Oct 2023 2:59 PM GMT
Next Story