Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: బాలీవుడ్‌లోనూ వాల్తేరు వీరయ్య రిలీజ్.. అనౌన్స్ చేసిన మేకర్స్

Waltair Veerayya: తెలుగులో విడుదలై అందర్నీ ఆకట్టుకుంటున్న రెండు టీజర్లను తాజాగా హిందీలో కూడా విడుదల చేశారు. ఈ రెండు టీజర్లు విడుదలైన కొన్ని గంటల్లోనే 10 లక్షల వ్యూస్ సాధించాయి.

Waltair Veerayya: బాలీవుడ్‌లోనూ వాల్తేరు వీరయ్య రిలీజ్.. అనౌన్స్ చేసిన మేకర్స్
X

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఇందులో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. పక్కా మాస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలు ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి, రవితేజ కలిసి నటించడం, చిరంజీవికి వీరాభిమాని అయిన బాబీ దర్శకత్వం వహిస్తుండడంతో ఫ్యాన్స్ ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్లు, లిరికల్ సాంగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని తాజాగా మేకర్స్ నిర్ణయించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప ఎటువంటి అంచనాలు లేకుండా హిందీలో విడుదలై భారీగా వసూళ్లు రాబట్టింది. దీంతో మంచి కమర్షియల్ కంటెంట్‌తో తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్యను కూడా హిందీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

తెలుగులో విడుదలై అందర్నీ ఆకట్టుకుంటున్న రెండు టీజర్లను తాజాగా హిందీలో కూడా విడుదల చేశారు. ఈ రెండు టీజర్లు విడుదలైన కొన్ని గంటల్లోనే 10 లక్షల వ్యూస్ సాధించాయి. కాగా, చిరంజీవి కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిన సైరా మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలవగా హిందీలో ఆశించినంత స్పందన రాలేదు. ఇటీవల చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా హిందీలో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు కూడా అనుకున్నంత స్థాయిలో వసూళ్లు దక్కలేదు. మరి వాల్తేరు వీరయ్య అయినా చిరంజీవికి హిందీలో సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.

First Published:  29 Dec 2022 12:08 PM GMT
Next Story