Telugu Global
Cinema & Entertainment

The Kerala Story - రూ. 175 కోట్లు కొల్లగొట్టిన వివాదాస్పద చిత్రం

The Kerala Story - కేరళ స్టోరీ సూపర్ హిట్టయింది. దేశవ్యాప్తంగా సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

The Kerala Story - రూ. 175 కోట్లు కొల్లగొట్టిన వివాదాస్పద చిత్రం
X

వివాదాస్పద ది కేరళ స్టోరీ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. ఓవైపు కొన్ని రాష్ట్రాల్లో సినిమాను నిషేధించినప్పటికీ, మరికొన్ని రాష్ట్రాల్లో మల్టీప్లెక్సుల్లో ఈ సినిమాను ప్రదర్శించనప్పటికీ.. కేరళ స్టోరీ సినిమా హవా తగ్గడం లేదు.

విడుదలైన 9 రోజులకే వంద కోట్ల క్లబ్ లోకి చేరిన ఈ సినిమా, తాజాగా మరో రికార్డ్ సృష్టించింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమా 175 కోట్ల రూపాయల (గ్రాస్)లోకి చేరింది. ఎలాంటి ప్రచారం లేకపోయినా, కేవలం మౌత్ టాక్ తో ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఇది కచ్చితంగా 200 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరుతుందని అంటోంది ట్రేడ్.

ఈమధ్య కాలంలో ఎలాంటి అంచనాల్లేకుండా రిలీజై, దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ అయిన సినిమాల్లో ఇది రెండోది. గతంలో ది కశ్మీర్ ఫైల్స్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ది కేరళ ఫైల్స్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయింది.

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అదా శర్మ కీలక పాత్ర పోషించింది. మే 5న హిందీ, తమిళం, తెలుగు, మలయాళంలో విడుదలైంది. విపుల్ షా నిర్మించిన 'ది కేరళ స్టోరీ' కేరళకు చెందిన మహిళలను ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) బలవంతంగా మతమార్పిడి చేసి రిక్రూట్‌మెంట్ చేయడాన్ని చూపించింది.

First Published:  21 May 2023 5:21 AM GMT
Next Story