Telugu Global
Cinema & Entertainment

The Goat Life | రూ.50 కోట్ల క్లబ్ లోకి..

The Goat Life - పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన సినిమా ది గోట్ లైఫ్ - ఆడుజీవితం. ఈ సినిమా అత్యంత వేగంగా 50 కోట్లు ఆర్జించిన మలయాళం సినిమాగా రికార్డ్ సృష్టించింది.

The Goat Life | రూ.50 కోట్ల క్లబ్ లోకి..
X

ది గోట్ లైఫ్.. దీనికి మరో పేరు ఆడు జీవితం. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం. మార్చి 28న విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం పృధ్వీరాజ్ సొంత రాష్ట్రం కేరళతో పాటు ఓవర్సీస్‌లో కూడా అద్భుతమైన ఓపెనింగ్స్‌ను నమోదు చేసింది.


సినిమా రెండో రోజు కూడా ఓపెనింగ్ డే కు తగ్గకుండా వసూళ్లు రావడం ఆశ్చర్యం. తాజాగా ఈ సినిమా మరో ఘనత సాధించింది. మలయాళ చిత్రసీమలో అత్యం వేగంగా 50 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాగా నిలిచింది. ది గోట్ లైఫ్ వసూళ్లు.. పృధ్వీరాజ్ డైరక్షన్ లో వచ్చిన లూసిఫెర్ లాంగ్ రన్ గ్రాసర్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. లూసిఫర్ సినిమా 4వ రోజు 50 కోట్ల మార్కును సాధించింది.


కానీ గోట్ లైఫ్, కేవలం 3 రోజుల్లోనే ఈ ఫీట్‌ను చేజిక్కించుకుంది. దీని గ్రాస్ దాదాపు 50 కోట్లకు చేరుకుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇదో పెద్ద రికార్డ్. ఆదివారం అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సినిమాకు అసాధారణంగా ఉన్నాయి. ఇది మలయాళ పరిశ్రమలో అత్యంత వేగంగా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా కూడా అవతరించే అవకాశం ఉంది.


మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు చిత్రాల బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మల్లూవుడ్ ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉంది. ఆ పొజిషన్ ను గోట్ లైఫ్ కొనసాగిస్తోంది.

First Published:  1 April 2024 2:31 AM GMT
Next Story