Telugu Global
Cinema & Entertainment

ఆ పదానికి అర్థం చెప్పిన 'ఘోస్ట్'

తమహాగానె.. ఈ పదానికి అర్థం చెప్పింది ఘోస్ట్ టీమ్. నాగార్జునకు, ఈ పదానికి గట్టి బంధమే ఉంది.

ఆ పదానికి అర్థం చెప్పిన ఘోస్ట్
X

తమహాగానే.. కొన్ని రోజులుగా ది ఘోస్ట్ టీమ్ ఊదరగొడుతున్న పేరు. సినిమాకు, ఈ పేరుకు సంబంధం ఏంటనే ఉత్సుకత కలిగించేలా గట్టిగా ప్రచారం చేశారు. ఎట్టకేలకు ఈరోజు ఆ పదానికి అర్థం వెల్లడించారు. ది ఘోస్ట్ సినిమాలో నాగార్జున వాడే కత్తి పేరే తమహాగానే.

ఈ కత్తికి చాలా చరిత్ర ఉందనే విషయాన్ని వెల్లడిస్తూ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. అండర్ వరల్డ్ మొత్తం తనపై దాడి చేయబోతోందన్న సమాచారం నాగ్‌కు అందడంతో, అతను తమహాగానే అనే విలువైన ముడి ఇనుమును బయటకు తీసి, దానితో అత్యంత పదునైన కత్తిని తయారుచేస్తాడు.

ద ఘోస్ట్ సిద్ధం చేసిన 'రెడ్ నోటీసు' అనే సీక్రెట్ ఫైల్‌ని చేజిక్కించుకోవడానికి, నాగ్ స్థావరానికి అండర్ వరల్డ్ వస్తుంది. అప్పుడు నాగ్, తన చేతిలో ఉన్న గన్ తో కరెంట్ తీసేస్తాడు. ఇక అక్కడ్నుంచి తమహాగానేతో నాగ్ చేసిన స్వైరవిహారం చూడాలంటే సినిమా చూడాల్సిందే.

దీనికి సంబంధించిన వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది. డార్క్ షేడ్ లో నాగ్ పై తీసిన విజువల్స్ అన్నీ రిచ్ గా ఉన్నాయి. భరత్-సౌరభ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ఇంటెన్స్ ఫీల్ ఇచ్చింది. ఈనెల 25న థియేట్రికల్ ట్రయిలర్ రిలీజ్ చేయబోతున్నట్టు తాజా వీడియో ద్వారా వెల్లడించారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది.



First Published:  18 Aug 2022 8:36 AM GMT
Next Story