Telugu Global
Cinema & Entertainment

ది ఘోస్ట్ షూటింగ్ అప్ డేట్స్

నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా ది ఘోస్ట్. ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. విడుదల తేదీ కూడా ప్రకటించారు.

ది ఘోస్ట్ షూటింగ్ అప్ డేట్స్
X

నాగార్జున, ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ఘోస్ట్'. మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ విక్రమ్ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున. శ్రీవెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై ఈ చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది.

ఇటివలే విడుదలైన ఘోస్ట్-కిల్లింగ్ మెషిన్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ విక్రమ్ గా నాగార్జున యాక్షన్ అదిరింది. ప్రత్యేకంగా రూపొందించిన యాక్షన్ బ్లాక్‌ అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఒక స్పెషల్ వీడియో ద్వారా చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు తెలియజేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో నాగార్జున గన్ ఫైరింగ్ చేస్తూ కనిపించడం ఇంట్రస్టింగా ఉంది.

దీనితో పాటు నాగార్జున, సోనాల్ చౌహాన్ లు ఒక పెద్ద జీప్ దగ్గర ఇంటర్‌పోల్ అధికారులుగా కనిపిస్తున్న పోస్టర్ ని కూడా విడుదల చేశారు.

ఈ పోస్టర్ లో వారి లుక్ అల్ట్రా-స్టైలిష్‌గా ఆకట్టుకుంది. అలాగే వారి దగ్గర వున్న మెషిన్ గన్‌లను చూస్తుంటే భారీ యాక్షన్ కి రెడీ అవుతున్నట్లుగా అర్ధమౌతోంది.

దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి వస్తున్నాడు ఘోస్ట్. నాగార్జున కల్ట్ క్లాసిక్, పాత్ బ్రేకింగ్ మూవీ శివ కూడా 1989లో అదే తేదీన విడుదలైంది.





First Published:  9 Aug 2022 5:00 AM GMT
Next Story