Telugu Global
Cinema & Entertainment

మరో 3 రోజుల్లో ఘోస్ట్ ట్రయిలర్

నాగార్జున హీరోగా నటించిన సినిమా ది ఘోస్ట్. ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ రెడీ అయింది. విడుదల తేదీని కూడా ప్రకటించారు.

మరో 3 రోజుల్లో ఘోస్ట్ ట్రయిలర్
X

నాగార్జున, ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ఘోస్ట్'. మునుపెన్నడూ చూడని పాత్రలో పవర్ ఫుల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌ గా ఈ చిత్రంలో కనిపించబోతున్నారు నాగార్జున.

ఇప్పటి వరకు విడుదలైన రెండు ప్రోమోలు - ది కిల్లింగ్ మెషిన్, తమహగనే ప్రేక్షకులని ఎట్రాక్ట్ చేశాయి. మునుపెన్నడూ చూడని యాక్షన్ కంటెంట్, నాగార్జున సూపర్ స్టైలిష్ గా కనిపించడం సినిమాపై క్యురియాసిటీని పెంచింది. ఇప్పుడు అందరి దృష్టి ది ఘోస్ట్ ట్రైలర్‌పైనే పడింది. ఎట్టకేలకు ట్రైలర్ డేట్ ప్రకటన వచ్చింది. ఆగస్ట్ 25న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్‌లో మరింత యాక్షన్‌ ని చూపించబోతున్నారు.

అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగార్జున, సోనాల్ చౌహాన్ శిధిలమైన ఓ పెద్ద భవంతిలో నిలబడి ఉండటం.. నాగార్జున ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ పట్టుకొని డాషింగ్ అండ్ సూపర్ ఫిట్‌గా కనిపించగా, సోనాల్ చేతిలో కూడా గన్ ఉండటం పోస్టర్ లో గమనించవచ్చు.

ది ఘోస్ట్ ఎమోషన్స్ కూడిన యాక్షన్ థ్రిల్లర్. ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ కాగా.. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు. భారీ అంచనాలున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి రానుంది.

First Published:  22 Aug 2022 2:30 AM GMT
Next Story