Telugu Global
Cinema & Entertainment

ది ఘోస్ట్.. సెన్సార్ టాక్ ఎలా ఉందంటే..!

నాగార్జున హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్. ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి. సెన్సార్ టాక్ ఎలా ఉందో చూద్దాం..

ది ఘోస్ట్.. సెన్సార్ టాక్ ఎలా ఉందంటే..!
X

నాగార్జున లేటెస్ట్ మూవీ ది ఘోస్ట్. దసరా కానుకగా విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. సినిమాను చూసి సెన్సార్ సభ్యులు, మూవీలో యాక్షన్ సీక్వెన్సులు చూసి థ్రిల్ ఫీల్ అయినట్టు చెబుతున్నారు. ఇప్పటివరకు టాలీవుడ్ స్క్రీన్ పై ఇలాంటి యాక్షన్ సీక్వెన్సులు రాలేదంట. కొరియన్ మూవీస్ టైపులో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నట్టు చెబుతున్నారు సెన్సార్ సభ్యులు.

ఈ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు (సెప్టెంబర్ 25) కర్నూలులోని ఎస్టీబిసి గ్రౌండ్‌లో గ్రాండ్ గా జరగనుంది. ఓపెన్ గ్రౌండ్ లో జరగబోతున్న ఈ పబ్లిక్ ఈవెంట్ కి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. టీమ్ మొత్తం ఈ వేడుకను ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకని మరింత సక్సెస్ చేయడానికి నాగచైతన్య, అఖిల్ కూడా హాజరుకానున్నారు.

సెన్సార్ క్లియరెన్స్ తో ఈ మూవీ థియేటర్లలోకి రావడానికి లైన్ క్లియర్ అయినట్టయింది. గాడ్ ఫాదర్ కు పోటీగా అక్టోబర్ 5న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా.. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

First Published:  24 Sep 2022 4:43 PM GMT
Next Story