Telugu Global
Cinema & Entertainment

ది ఘోస్ట్.. 'వేగం' చూపిన నాగార్జున

నాగార్జున హీరోగా నటిస్తున్న ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ది ఘోస్ట్. ఇప్పుడీ సినిమా నుంచి పాటలు రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈరోజు ఫస్ట్ సాంగ్ రిలీజైంది

ది ఘోస్ట్.. వేగం చూపిన నాగార్జున
X

నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబోలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్' ది ఘోస్ట్'. ఈ సినిమాలో భారీ యాక్షన్ తో పాట ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ ఇతర ప్రధాన ఆకర్షణగా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్ధమౌతోంది. ఇప్పుడు సాంగ్స్ రిలీజ్ చేసే కార్యక్రమం షురూ చేశారు.

ముందుగా చెప్పినట్లే ఈ చిత్రం నుండి వేగం అనే లిరిక్స్ తో సాగే సాంగ్ ను ఫస్ట్ సింగిల్‌ గా రిలీజ్ చేశారు. ఈ పాట సినిమాలోని రొమాంటిక్ సైడ్ ని ప్రజంట్ చేసింది. నాగార్జున, సోనాల్ చౌహాన్ కలిసి తమ లవ్లీ టైమ్ ని ఉల్లాసంగా గడుపుతున్న నేపథ్యంలో ఈ పాట వచ్చిందని లిరికల్ వీడియో చూస్తే అర్థమౌతుంది.

లిరికల్ వీడియోలో నాగార్జున స్టైలిష్ గా కనిపించగా, సోనాల్ చౌహాన్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. వారి కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది.

భరత్, సౌరబ్ ద్వయం రొమాంటిక్ ఫీల్‌తో కూడిన ఈ లవ్లీ ట్యూన్ ని కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్, రమ్య బెహరా పాటని పాడగా, కృష్ణ మాదినేని సాహిత్యం ఆకట్టుకుంది. సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లకు ఈ పాట సరైన ఆరంభాన్ని ఇచ్చింది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈ భారీ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల చేయబోతున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్‌లు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.



First Published:  16 Sep 2022 4:14 PM GMT
Next Story