Telugu Global
Cinema & Entertainment

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయితో లైగర్ కనెక్షన్ ఏంటి?

ఇప్పుడొస్తున్న లైగర్ కు, అప్పుడెప్పుడో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాకు ఏమైనా కనెక్షన్ ఉందా?

అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయితో లైగర్ కనెక్షన్ ఏంటి?
X

లైగర్ సినిమా సెట్స్ పై ఉన్నప్పట్నుంచి ఆ మూవీపై ఓ ప్రచారం నడుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు, గతంలో రవితేజ హీరోగా నటించిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాకు పోలికలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ రెండు సినిమాలకు పూరి జగన్నాదే దర్శకుడు కావడం విశేషం. ఎట్టకేలకు ఈ మేటర్ పై హీరో విజయ్ దేవరకొండ స్పందించాడు.

"పూరి గారి అమ్మా నాన్న తమిళమ్మాయికి నేను ఫ్యాన్ ని. చాలా సార్లు ఆ సినిమా చూశా. రీమేకులు ఫ్రీమేకులు నాకు ఇష్టం ఉండదు. ఆ సినిమా కథతో కొంచెం పోలిక ఉన్నా నేను చేయను కదా. పైగా లైగర్ లో ఉన్నది బాక్సింగ్ కాదు. ఎంఎంఎ అనే మార్షల్ ఆర్ట్స్. అమ్మా నాన్న తమిళమ్మాయితో లైగర్ కి ఎలాంటి పోలిక లేదు." ఇలా లైగర్ కు, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయికి సంబంధం లేదని స్పష్టంచేశాడు విజయ్ దేవరకొండ.

అమ్మానాన్న తమిళ అమ్మాయి సినిమాలో హీరో ఫైటర్. లైగర్ లో కూడా హీరో ఫైటర్. ఆ సినిమాలో హీరోను తల్లి పెంచుతుంది. ఈ సినిమాలో కూడా హీరోను తల్లి పెంచుతుంది. ఇలాంటి కొన్ని పోలికలు తీశారు కొంతమంది జనాలు. అయితే అలాంటి చిన్న చిన్న పోలికలున్నప్పటికీ, లైగర్ కు, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో ఎలాంటి సంబంధం లేదంటున్నాడు దేవరకొండ.

First Published:  15 Aug 2022 1:17 PM GMT
Next Story