Telugu Global
Cinema & Entertainment

ఆ నవదీప్ నేను కాదు.. నేను ఎక్కడికీ పారిపోలేదు

సినీ నటుడు నవదీప్ పేరు కూడా ఈ కేసులో వినిపించింది. ఆయన పరారీలో ఉన్నాడని, ప్రస్తుతం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

ఆ నవదీప్ నేను కాదు.. నేను ఎక్కడికీ పారిపోలేదు
X

టాలీవుడ్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. మాధాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో హైదరాబాద్ పోలీసులకు పలు కీలక విషయాలు తెలిశాయి. దీనిపై గురువారం మీడియాతో మాట్లాడిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సంచలన విషయాలను వెల్లడించారు. ఈ కేసులో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురి పేర్లు ఉండటం చర్చనీయాంశంగా మారింది. మాధాపూర్ డ్రగ్స్ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని.. మరి కొందరు పరారీలో ఉన్నారని సీవీ ఆనంద్ చెప్పారు.

కాగా, సినీ నటుడు నవదీప్ పేరు కూడా ఈ కేసులో వినిపించింది. ఆయన పరారీలో ఉన్నాడని, ప్రస్తుతం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. త్వరలోనే వీరందరినీ పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. కాగా, సీవీ ఆనంద్.. నవదీప్ పేరు చెప్పగానే సినీ నటుడు నవదీప్‌కు మాధాపూర్ డ్రగ్స్ కేసులో సంబంధం ఉందంటూ పలు మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. గతంలో కూడా నవదీప్ పేరు డ్రగ్స్ కేసులో వినిపించడంతోనే ఈ సారి కూడా అతడే ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడని అందరూ భావించారు.

తాజాగా ఈ వార్తలపై హీరో నవదీప్ స్పందించాడు. తనకు మాధాపూర్ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలు కూడా పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నాడు. డ్రగ్స్ కేసులో తన ఇన్వాల్వ్‌మెంట్‌ను నవదీప్ ఖండించాడు. హైదరాబాద్‌లోనే ఉన్నానని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా క్లారిటీ ఇచ్చారు. తన ఫోన్లు కూడా ఏమీ స్విచ్ఛాఫ్ చేసుకోలేదని తెలిపాడు.

కాగా, మాధాపూర్ డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి స్నాట్ పబ్ నిర్వహించే సూర్య, జూబ్లీహిల్స్‌లోని టెర్రా కేఫే అండ్ బిస్ట్రో బార్ నిర్వాహకుడు అర్జున్, షాడో సినిమా నిర్మాత రవి ఉప్పలపాటి, కల్హర్ రెడ్డి, ఇంద్రతేజ్, నవదీప్, శ్వేత, కార్తీక్ పరారీలో ఉన్నట్లు సీపీ ఆనంద్ వివరించారు.


First Published:  15 Sep 2023 2:07 AM GMT
Next Story