Telugu Global
Cinema & Entertainment

DSP | దేవిశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తండేల్ టీమ్

Devisri Prasad - దేవిశ్రీ ప్రసాద్ కు తండేల్ యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. స్వయంగా నాగచైతన్య వచ్చి దేవిశ్రీకి శుభాకాంక్షలు తెలిపాడు.

DSP | దేవిశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తండేల్ టీమ్
X

నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్న మూవీ ఇది. ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే సందర్భంగా 'తండేల్' టీం ఆయనకు విషెస్ తెలియజేసింది. హీరో నాగ చైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాత బన్నీవాసు, దేవిశ్రీని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

'తండేల్'లో మ్యూజిక్ హైలెట్ అంటూ మొదట్నుంచి చెబుతున్నారు. సినిమాకు అద్భుతమైన సాంగ్స్ వచ్చాయని అంటున్నారు. దీంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వస్తోందని అంటున్నారు. త్వరలోనే మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభిస్తారు.

నాగచైతన్య, సాయి పల్లవి ఇద్దరూ తమ కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇద్దరూ డీ-గ్లామర్ రోల్స్ లో కనిపించబోతున్నారు. లవ్ స్టోరీ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న రెండో సినిమా ఇది.

First Published:  3 Aug 2024 4:20 PM GMT
Next Story