Telugu Global
Cinema & Entertainment

ఈసారి నాకు జాతీయ అవార్డ్ రావాలి

తమన్న లేటెస్ట్ మూవీ బబ్లీ బౌన్సర్. ఓటీటీలో నేరుగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో నేషనల్ అవార్డ్ ఆశిస్తోంది మిల్కీ బ్యూటీ.

ఈసారి నాకు జాతీయ అవార్డ్ రావాలి
X

మిల్కీ బ్యూటీ తమన్న గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులోనే కెరీర్ స్టార్ట్ చేసి, ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు తమిళ-హిందీ భాషల్లో నటిగా కొనసాగుతోంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ నేషనల్ అవార్డ్ పై కన్నేసింది. ఈసారి తనకు జాతీయ అవార్డ్ వస్తుందేమో అంటూ ధీమాగా చెబుతోంది. ఇంతకీ ఏంటి మేటర్?

"తొలిసారిగా లేడీ బౌన్సర్ కాన్సెప్ట్ తో వస్తున్న బబ్లీ బౌన్సర్ స్క్రిప్ట్ దొరకడం నా అదృష్టం. పలుమార్లు జాతీయు అవార్డ్స్ అందుకున్న మధుర్ భండార్కర్ తో సినిమా చేసే అవకాశం వచ్చిందుకు చాలా గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమాలో హరియాణాకు చెందిన యువతిగా నటించాను. తప్పకుండా ఈ సినిమా నా కెరీర్ లో బెస్ట్ అవుతుంది. మధుర్ బండార్కర్ సినిమాలో నటించిన హీరోయిన్స్ కు జాతీయ అవార్డ్స్ వస్తాయి. నాకు కూడా ఈ చిత్రానికి అవార్డ్స్ రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను."

ఇలా బబ్లీ బౌన్సర్ పై తన అంచనాల్ని బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. నిజానికి ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదు. ఈ నెల 23న డిస్నీ+ హాట్‌స్టార్‌ లో విడుదల అవుతోంది. కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చొని అంతా ఈ సినిమాను చూడొచ్చని హామీ ఇస్తోంది మిల్కీబ్యూటీ.

Next Story