Telugu Global
Cinema & Entertainment

Thaman: వీర సింహా రెడ్డి కల్ట్ మూవీ

Veera Simha Reddy: వీరసింహారెడ్డి సినిమా బాలకృష్ణ అభిమానుల కల్ట్ మూవీ అవుతుందని అంటున్నాడు తమన్.

Thaman: వీర సింహా రెడ్డి కల్ట్ మూవీ
X

వీరసింహారెడ్డి అందరి సినిమా కాదంటున్నాడు తమన్. ఇదొక కల్ట్ మూవీ అంటున్నాడు. మరీ ముఖ్యంగా ఫ్యాన్స్ ఆశించే అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయని చెబుతున్నాడు. పైగా అఖండకు, ఈ తాజా చిత్రానికి అస్సలు పోలిక ఉండదంటున్నాడు.

"వీరసింహ రెడ్డికి అఖండతో పోలిక లేదు. ఇది కల్ట్ మూవీ. ఎమోషనల్ హై, సిస్టర్ సెంటిమెంట్, బాలకృష్ణ గారి మాస్ అదిరిపోతుంది. గోపీచంద్ మలినేని బాలకృష్ణ గారి అభిమానిగా చాలా గొప్పగా తీశారు. నేపధ్య సంగీతం కూడా చాలా బాగా వచ్చింది. వీరసింహారెడ్డి కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. వీరసింహారెడ్డి వేరే రేంజ్ లో ఉంటుంది. బాలకృష్ణ కల్ట్ మూవీ ఇది. బాలకృష్ణ గారిని ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ ఎంత అభిమానిస్తున్నారో వీరసింహారెడ్డి రిజల్ట్ చెబుతుంది."

తమన్ చెప్పింది కరెక్టే. ఈరోజు రిలీజైన వీరసింహారెడ్డి సినిమా కేవలం బాలయ్య కల్ట్ అభిమానులకు మాత్రమే నచ్చుతుంది. ఇందులో కథ కంటే ఎలివేషన్లు ఎక్కువ. బాలకృష్ణ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమాలా ఉంది వీరసింహారెడ్డి.

బాలకృష్ణ ద్విపాత్రాభియనం చేసిన ఈ సినిమాలో అతడి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు.

First Published:  12 Jan 2023 6:51 AM GMT
Next Story