Telugu Global
Cinema & Entertainment

ఫస్ట్ డే కలెక్షన్స్ .. రికార్డులు సృష్టించిన లియో

Leo Movie Box Office Collection: ట్రేడ్ అంచనా వేసినట్లుగానే లియో మొదటి రోజు కలెక్షన్లలో దుమ్ము లేపింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తొలి రోజు రికార్డు స్థాయిలో రూ.145 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

ఫస్ట్ డే కలెక్షన్స్ .. రికార్డులు సృష్టించిన లియో
X

ఫస్ట్ డే కలెక్షన్స్ .. రికార్డులు సృష్టించిన లియో

తమిళ అగ్ర హీరో, ఇళయ దళపతి విజయ్ నటించిన లియో సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ లో రికార్డులు సృష్టిస్తోంది. కోలీవుడ్లో రూ.145 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో రోబో 2.0 తర్వాతి స్థానంలో నిలిచింది. విజయ్ హీరోగా, త్రిష హీరోయిన్‌గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ లియో. విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లోకేష్ నుంచి వస్తున్న సినిమా కావడం, అందులో విజయ్ హీరోగా నటిస్తుండడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఈ చిత్రం రికార్డులు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో సుమారు 2800 థియేటర్లలో లియో విడుదల అయింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 థియేటర్లలో లియో రిలీజ్ అయింది. ట్రేడ్ అంచనా వేసినట్లుగానే లియో మొదటి రోజు కలెక్షన్లలో దుమ్ము లేపింది. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ తొలి రోజు రికార్డు స్థాయిలో రూ.145 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

తమిళనాడులో రూ.32 కోట్లు, కేరళలో రూ.12.50 కోట్లు, కర్ణాటకలో రూ.14.50 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.17 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మొత్తంగా ఇండియాలో రూ.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, ఓవర్సీస్‌లో రూ.65 కోట్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా లియో రూ.145 కోట్ల వసూళ్లు సాధించింది. విజయ్ నటించిన సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి. నార్త్ అమెరికాలో కూడా లియో సినిమా సంచలన వసూళ్లు సాధిస్తోంది. ఇక్కడ అక్టోబర్ 19న విడుదలైన అన్ని సినిమాల్లో లియో అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఫస్ట్ వీకెండ్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా ఉండడంతో ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

First Published:  20 Oct 2023 8:58 AM GMT
Next Story