Telugu Global
Cinema & Entertainment

Dhamaka: ధమాకా రిజల్ట్ ముందే తెలుసు

Dhamaka Movie: రవితేజ హీరోగా నటించిన సినిమా ధమాకా. ఈ సినిమా హిట్ అవుతుందని తనకు ముందే తెలుసంటున్నాడు నిర్మాత.

Dhamaka: ధమాకా రిజల్ట్ ముందే తెలుసు
X

రవితేజ హీరోగా నటించిన సినిమా ధమాకా. ఈ మూవీ రిజల్ట్ తనకు ముందే తెలుసంటున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. అంతేకాదు, ఈ కథలో కొత్త మెరుపుల్లేవని విషయం కూడా తనకు తెలుసని, కేవలం వినోదం పండి సినిమా హిట్ అవుతుందనే నమ్మకంతోనే సినిమా నిర్మించినట్టు చెప్పుకొచ్చారు.

"ధమాకా కంప్లీట్ మాస్ ఎంటర్ టైనర్ కథ. రవితేజ ఎనర్జీ ని పూర్తిగా ఎలివేట్ చేస్తూ చేసిన మూవీ. అలాగే ఎవరూ ఊహించని ట్విస్ట్ కూడా ఉంది. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్ నుండి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. బీ సీ సెంటర్ల రెస్పాన్స్ మేము ఊహించాం. మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుండి మేము ఊహించిన దానికంటే ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది."

ధమాకా సినిమాకు శ్రీలీల మరో ప్లస్ పాయింట్ అంటున్నాడు టీజీ. ఈ సినిమా కోసం ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల పేర్లు అనుకున్నప్పటికీ, ముందుగా శ్రీలీలనే సంప్రదించామని, ఆమెనే ఫిక్స్ చేశామని తెలిపాడు.

ఈ వినోదాత్మక చిత్రానికి పాటలు ప్రాణమనే విషయాన్ని తను ముందే ఊహించానని, అందుకే పాటల కోసం భారీ సెట్స్ వేశామని, ప్రత్యేకంగా సాంగ్స్ కోసమే బడ్జెట్ పెట్టుకొని మరీ షూటింగ్ చేశామని వెల్లడించారు టీజీ విశ్వప్రసాద్.

First Published:  24 Dec 2022 3:38 PM GMT
Next Story