Telugu Global
Cinema & Entertainment

కృష్ణ మృతితో ముగిసిన ఒక తరం సినీ ప్రస్థానం

ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు మరణం తర్వాత టాలీవుడ్‌కు పెద్దదిక్కుగా కృష్ణ, కృష్ణంరాజు ఉంటూ వచ్చారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 11న కృష్ణంరాజు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఈ రోజు కృష్ణ మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ తొలి తరానికి చెందిన అగ్రహీరోలందరినీ కోల్పోయినట్లయింది.

కృష్ణ మృతితో ముగిసిన ఒక తరం సినీ ప్రస్థానం
X

తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎంతో మంది కథానాయకులుగా పరిచయమైనప్పటికీ తొలి తరం స్టార్ హీరోలుగా గుర్తింపు పొందింది మాత్రం ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబే. వీరికంటే ముందే తెలుగులో కొంతమంది హీరోలుగా పరిచయం అయినప్పటికీ ప్రజల్లో అత్యంత గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న తొలి తరం హీరోలుగా వీరు పేరు తెచ్చుకున్నారు. దశాబ్దాల పాటు తెలుగు తెరను ఏలారు.

వీరి తర్వాతి తరం అగ్ర హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పేరు తెచ్చుకోగా.. ప్రస్తుత తరంలో అగ్ర హీరోలుగా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పేరు తెచ్చుకున్నారు. ఇక తొలి తరం అగ్ర హీరోల్లో ఒకరైన ఎన్టీఆర్ 1996 జనవరి 18వ తేదీన మరణించారు. ఆ తర్వాత శోభన్ బాబు 2008 మార్చి 20న కన్నుమూశారు.

వీరిద్దరి మరణం తర్వాత 2014 జనవరి 22న అక్కినేని నాగేశ్వరరావు చనిపోయారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు మరణం తర్వాత టాలీవుడ్‌కు పెద్దదిక్కుగా కృష్ణ, కృష్ణంరాజు ఉంటూ వచ్చారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్ 11న కృష్ణంరాజు అనంత లోకాలకు వెళ్లిపోయారు. ఇక తొలి తరం అగ్రహీరోల్లో మిగిలిన కృష్ణ ఇవాళ మృతి చెందడంతో తెలుగు సినీ పరిశ్రమ తొలి తరానికి చెందిన అగ్రహీరోలందరినీ కోల్పోయినట్లయింది.

First Published:  15 Nov 2022 7:15 AM GMT
Next Story