Telugu Global
Cinema & Entertainment

గాంజా శంక‌ర్ టైటిల్‌లో ఆ ప‌దం తొల‌గించండి.. సాయి తేజ్ సినిమాకు నోటీసులు

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న గాంజా శంక‌ర్ సినిమాకు చిక్కొచ్చి ప‌డింది.

గాంజా శంక‌ర్ టైటిల్‌లో ఆ ప‌దం తొల‌గించండి.. సాయి తేజ్ సినిమాకు నోటీసులు
X

సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న గాంజా శంక‌ర్ సినిమాకు చిక్కొచ్చి ప‌డింది. ఈ సినిమా పేరులో ఉన్న గాంజా (గంజాయి) అనే ప‌దాన్ని తొల‌గించాల‌ని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో (టీఎస్ న్యాబ్‌) చిత్ర యూనిట్‌కు నోటీసులు జారీ చేసింది.

యూత్‌పై ప్ర‌భావం చూపే ప్ర‌మాదం

విద్యార్థులు, యువ‌త‌పై గాంజా శంక‌ర్ టైటిల్ ప్ర‌భావం చూపుతుంద‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. సినిమాలో గంజాయి సీన్లు, డైలాగులు లేకుండా చూడాల‌ని సూచించారు. సినిమాలో మాద‌క‌ద్ర‌వ్యాల‌కు సంబంధించిన అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలంటే చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని టీఎస్ న్యాబ్ పోలీసులు ఆ నోటీసుల్లో చిత్ర యూనిట్‌ను హెచ్చ‌రించారు.


డ్ర‌గ్స్ నియంత్ర‌ణ‌పై టీఎస్ న్యాబ్ ప‌ట్టు

రాష్ట్రంలో డ్ర‌గ్స్‌ను నియంత్రించాల‌ని, డ్ర‌గ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి ఎంతటి క‌ఠిన‌చ‌ర్య‌ల‌కైనా సిద్ధ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో టీఎస్ న్యాబ్ మాద‌క‌ద్ర‌వ్యాల‌ను ప్రోత్స‌హిస్తున్న సినిమా వంటి బ‌ల‌మైన మాధ్య‌మాల‌పైనా దృష్టి సారించింది.

First Published:  18 Feb 2024 5:39 AM GMT
Next Story