Telugu Global
Cinema & Entertainment

Hanu-Man: దుమ్ముదులుపుతున్న హనుమాన్ టీజర్

Teja Sajja's HanuMan: తేజ సజ్జ కొత్త సినిమా హను-మాన్. ఈ సినిమా టీజర్ సరికొత్త రికార్డ్ సృష్టించింది.

Hanu-Man: దుమ్ముదులుపుతున్న హనుమాన్ టీజర్
X

తేజ సజ్జా హీరోగా నటిస్తున్న సూపర్ హీరో సినిమా హను-మాన్. ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా టీజర్ రిలీజైంది. దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయింది. తాజాగా హనుమాన్ టీజర్ 50 మిలియన్ల వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్ తో పెద్ద రికార్దుని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. హనుమంతుడి ముందు తేజ సజ్జ చేతిలో గదతో నిలబడి ఉన్న పోస్టర్ అద్భుతంగా ఉంది.

శ్రీరాముడి ఆశీస్సులు పొందిన టీమ్ ఇటీవలే అయోధ్య నుంచి ప్రచార యాత్రను ప్రారంభించింది. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.

ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్స్ అందిస్తున్నారు. హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు.




First Published:  6 Dec 2022 7:15 AM GMT
Next Story