Telugu Global
Cinema & Entertainment

HanuMan Movie Teaser: విజువల్ వండర్ గా హనుమాన్ టీజర్

HanuMan Movie Teaser: ప్రశాంత్ వర్మ నుంచి మరో డిఫరెంట్ మూవీ వస్తోంది. హను-మాన్ మూవీ టీజర్ రిలీజైంది. విజువల్ వండర్ అనిపిస్తోంది.

HanuMan Movie Teaser: విజువల్ వండర్ గా హనుమాన్ టీజర్
X

తెలుగులో తొలి జాంబీ చిత్రం తీసిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ దర్శకుడి కొత్త సినిమా హనుమాన్. ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమా ఇది. తేజ సజ్జా హీరోగా నటించాడు. ప్రశాంత్ వర్మ ఇదివరకే తేజ సజ్జ పాత్రను ఒక గ్లింప్స్ ద్వారా పరిచయం చేశాడు. తర్వాత పోస్టర్ల ద్వారా ఇతర ప్రధాన పాత్రలనూ పరిచయం చేశాడు. ఈ రోజు సినిమా టీజర్ తో మనముందుకొచ్చాడు.

ఒక అద్భుతమైన జలపాతాన్ని చూపిస్తూ టీజర్ ప్రారంభమైంది. జలపాతంకు ఆనుకొని చేతిలో గదతో భారీ హనుమాన్ విగ్రహం కూడా దర్శనమిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ లో శ్రీరామ నామం వినిపించింది. సముద్రం ఒడ్డున అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లుగా తేజ సజ్జా ఎంట్రీ ఇచ్చాడు. అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్రల్ని కూడా పరిచయం చేశారు.

హనుమంతు అండర్‌ డాగ్‌ నుంచి సూపర్‌హీరోగా మారడం విజువల్ వండర్ గా ఉంది. గద పట్టుకుని, కొండపై నిలబడి, హెలికాప్టర్‌ సమీపిస్తుండగా ఆకాశంలో ఎగురుతూ తన అతీత శక్తులను చూపిస్తూ.. హనుమంతుడు ఆవహించినట్లు కనిపిస్తోంది. హనుమ తపస్సు చేస్తూ, రామ నామం జపిస్తున్నట్టు చివర్లో చూపించి టీజర్ ముగించారు.

ప్రశాంత్ వర్మ,అతని టీం చేసిన వర్క్ ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. 2 నిమిషాల టీజర్ విజువల్ వండర్ గా అంజనాద్రి ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లింది. శివేంద్ర తన అద్భుతమైన కెమెరా వర్క్‌తో స్క్రీన్‌కి అతుక్కుపోయేలా చేశాడు. సంగీత దర్శకుడు గౌరహరి తన అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తో మంత్రముగ్ధుల్ని చేశాడు.



First Published:  21 Nov 2022 3:03 PM GMT
Next Story